జాతీయ వార్తలు

జమిలి ఎన్నికలకు సిద్ధమేనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 29: ఈ సంవత్సరాంతంలో మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్ తదితర రాష్ట్రాల శాసనసభల ఎన్నికలతోపాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తదితర రాష్ట్రాల శాసనసభల ఎన్నికలు జరిపే ప్రతిపాదనను ప్రధాని నరేంద్ర మోదీ పరిశీలిస్తున్నట్లు కనిపిస్తోంది. పార్లమెంటు బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా నరేంద్ర మోదీ సోమవారం సాయంత్రం ఎన్‌డీఏ మిత్రపక్షాల పార్లమెంటరీ పార్టీ నాయకులు, లోక్‌సభ, రాజ్యసభ పక్షం నాయకులతో సమావేశం జరిపారు. తెలుగుదేశం తరపున పార్లమెంటరీ పార్టీ నాయకుడు, కేంద్ర మంత్రి సజనా చౌదరి, లోక్‌సభలో పార్టీపక్షం నాయకుడు తోట నరసింహం హాజరయ్యారు. బడ్జెట్ సమావేశాలను సజావుగా నిర్వహించుకోవటం, ట్రిపుల్ తలాక్ బిల్లుకు రాజ్యసభ ఆమోదం తీసుకోవటం తదితర అంశాలతోపాటు నవంబర్‌లో జమిలి ఎన్నికల నిర్వహణ గురించి కూడా నరేంద్ర మోదీ మిత్రపక్షాల నాయకలతో చర్చించినట్లు తెలిసింది.
జమిలి ఎన్నికలకు మీరు సిద్ధమేనా అని ఆయన సుజనా చౌదరిని అడుగ్గా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో చర్చించిన తరువాత పార్టీ అభిప్రాయం తెలియజేస్తామని చెప్పారు. జమిలి ఎన్నికలకు బీజేపీ సిద్ధంగా ఉన్నదనే సంకేతాన్ని నరేంద్ర మోదీ ఇచ్చారని మిత్రపక్షాల నాయకులు చెబుతున్నారు. మిత్రపక్షాలు సుముఖంగా ఉంటే ఈ సంవత్సరాంతం అంటే నవంబర్‌లో మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్ తదితర రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతోపాటు లోక్‌సభ, తెలంగాణ, ఏపీ, మరికొన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించే అంశంపై సానుకూల నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయని బీజేపీ నాయకులు చెబుతున్నారు. నరేంద్ర మోదీ జమిలి ఎన్నికలకు వెళ్లే పక్షంలో ఏప్రిల్, మేలో జరగవలసిన కర్నాటక అసెంబ్లీ ఎన్నికను కూడా దీనితో కలుపుతారనే మాట వినిపిస్తోంది.
ఎన్‌డీఏ మిత్రపక్షాల సమావేశంలో జమిలి ఎన్నికలపై సలహాలు అడిగారని సుజనా చౌదరి విలేఖరులకు తెలిపారు. చంద్రబాబుతో సంప్రదించిన అనంతరం తెలుగుదేశం వైఖరిని తెలియజేస్తామని చెప్పినట్లు ఆయన వెల్లడించారు. దేశ ఆర్థిక పరిస్థితులు, రాజకీయ పరిస్థితుల గురించి సమావేశంలో చర్చ జరిగిందని ఆయన వివరించారు. విభజన చట్టంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని సమావేశంలో డిమాండ్ చేశామన్నారు. చట్టంలోని పెండింగ్ అంశాలపై ప్రధాన మంత్రి మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాతో చర్చించవలసిన అవసరం ఉన్నదని తెలిపారు. మిత్ర ధర్మాన్ని ఎలా పాటించాలనేది అమిత్ షాకు వివరిస్తామని చౌదరి చెప్పారు. సంయమనంతో వ్యవహరించాలని చంద్రబాబు తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలకు సూచించారని ఆయన తెలిపారు. బీజేపీ కూడా తమ నాయకులు, కార్యకర్తలకు సంయమనాన్ని బోధించాలని చౌదరి సూచించారు.