జాతీయ వార్తలు

ఫిరాయింపులను ప్రోత్సహించటం సిగ్గుచేటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 13: తెలంగాణలో అధికారంలో ఉన్న టిఆర్‌ఎస్ ప్రభుత్వం పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించటం సిగ్గుచేటని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అనంద్ శర్మ దుయ్యబట్టారు. సోమవారం ఏఐసిసి కార్యాలయంలో ఆయన విలేఖరులతో మాట్లాడుతూ, అధికారంలో ఉన్న పార్టీలు తమ మనుగడను కాపాడుకునేందుకు ఇతర పార్టీల ఎంపీలు, ఎమ్మెల్యేలను తమ పార్టీలో చేర్చుకోవటం సిగ్గుచేటని విమర్శించారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి చెందిన లోక్‌సభ సభ్యుడు గుత్తా సుఖేందర్ రెడ్డి, మరికొందరు శాసనసభ్యులతోపాటు మరికొందరు టిఆర్‌ఎస్‌లో చేరుతున్నారు, దీనిపై మీ స్పందన ఏమిటి? వీరు టిఆర్‌ఎస్‌లో చేరకుండా ఆపేందుకు ఏవైనా చర్యలు తీసుకుంటున్నారా? అని ఒక విలేఖరి ప్రశ్నించగా, ఈ విషయం తనకు తెలియదని, అధికారంలో ఉన్నవారు ఇలా పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించటం సిగ్గుచేటని, గతంలోకూడా తమ పార్టీకి చెందిన కొందరు శాసన సభ్యులను తీసుకున్నారని ఆనంద్ శర్మ చెప్పారు. కర్నాటకలో యెడ్యూరప్ప ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఇలాంటి ఫిరాయింపులు జరిగాయన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఇచ్చినందుకు కాంగ్రెస్‌కు లభిస్తున్న ప్రతిఫలమా ఇది అని ఆయన ఆవేదనను వ్యక్తం చేశారు.