జాతీయ వార్తలు

అమర్‌నాథ్ యాత్రికులపై దాడి కేసులో చార్జిషీట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీనగర్, జనవరి 29: జమ్మూకాశ్మీర్‌లోని అమర్‌నాథ్ యాత్రికులపై దాడి కేసుకు సంబంధించి 11 మంది లష్కరే తోయిబా ఉగ్రవాదులపై పోలీసులు సోమవారం చార్జిషీట్ దాఖలు చేశారు. 2017 జూలైలో జరిగిన ఉగ్రదాదిలో ఎనిమిది మంది యాత్రికులు మృతి చెందారు. రణ్‌బీర్ పీనల్‌కోడ్ కింద (ఐపీసీ లాంటిదే) వివిధ సెక్షన్లు నిందితులపై పెట్టారు. మొత్తం 1600 పేజీల చార్జిషీట్‌ను అనంతనాగ్ సెషన్స్ కోర్టులో దాఖలు చేసినట్టు అధికార వర్గాలు వెల్లడించారు. ఉగ్రవాద వ్యతిరేక, చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడినట్టు 11 మందిపై అభియోగం. డీఐజీ(దక్షిణ కాశ్మీర్) ఎస్పీ సింగ్ నేతృత్వంలోని సిట్ ఆరు నెలల్లో దర్యాప్తు పూర్తిచేసింది. 11 మంది లష్కరే ఉగ్రవాదుల్లో ఒక బాలుడూ ఉన్నట్టు అధికార ప్రతినిధి వెల్లడించారు. బాల నేరస్తుడిపై అనంతనాగ్ జువైనల్ చీఫ్ జుడీషియల్ మెజిస్ట్రేట్ కోర్టులో వేరుగా చార్జిషీట్ దాఖలు చేశారు.