జాతీయ వార్తలు

ఖాళీల భర్తీ లేనట్టే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 30: ప్రభుత్వంలోని వివిధ విభాగాల్లో ఐదేళ్లకు పైగా ఖాళీగా ఉన్న పోస్టులను రద్దుచేయనున్నారు. ఈ మేరకు సమగ్ర నివేదిక ఇవ్వాలని అన్ని మంత్రిత్వశాఖలను కేంద్రం ఆదేశించింది.
ఐదేళ్లకుపైగా ఖాళీగా ఉన్న పోస్టులను రద్దుచేయడానికి సంబంధించిన కార్యాచరణ, తీసుకున్న చర్యలపై నివేదిక ఇవ్వాలని ఆర్థిక మంత్రిత్వశాఖ ఆయా శాఖలను కోరింది. అయితే ఇప్పటికే కొన్ని విభాగాలు, మంత్రిత్వశాఖలు స్పందించాయని ఓ అధికార ప్రకటనలో వెల్లడించారు. కొన్ని శాఖలు త్వరలోనే సమగ్ర నివేదిక ఇస్తామని సమాచారం ఇచ్చాయని అన్నారు. అన్ని మంత్రిత్వశాఖల, విభాగాల ఆర్థిక సలహాదారులు / జాయింట్ సెక్రెటరీలు (పరిపాలన) దీనిపై దృష్టిసారించి ఐదేళ్లకు పైబడి ఎక్కడ ఖాళీలున్నాయి గుర్తించాలని ప్రభుత్వం ఆదేశించింది. రద్దుచేయడానికి అవసరమైన చర్యలు తీసుకుంటూ తమకు సమగ్రమైన నివేదిక సాధ్యమైనంత త్వరగా ఇవ్వాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ నెల 16న ఆఫీస్ మెమొరాండంలో ఈ విషయాలన్నీ స్పష్టం చేశారు.
ప్రాథమిక సమాచారం ప్రకారం కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో ఏళ్ల తరబడి కొన్ని వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్టు వెల్లడైంది. ఇవన్నీ ఐదేళ్లకు పైబడినవేనని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఈ పరిణామాలు గమనిస్తే ఇక ఖాళీల భర్తీపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.