జాతీయ వార్తలు

శ్రీమంతులం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 30: భారత అభివృద్ధి మాగాణిలో సిరులు పండుతున్నాయి. ప్రపంచంలోనే ఆరో అత్యంత సంపన్న దేశంగా సరికొత్త వెలుగులను సంతరించుకుంది. 2017 సంవత్సరానికి జరిగిన సంపద గణాంకాల్లో 8,230 బిలియన్ డాలర్లతో భారత్ ఆరోస్థానాన్ని సంతరించుకుందని తాజాగా జరిగిన ఓ సర్వేలో వెల్లడైంది. 64,584 బిలియన్ డాలర్లతో అమెరికా మొదటి స్థానంలో 24,803 బిలియన్ డాలర్లతో చైనా రెండో స్థానంలో, 19,522 బిలియన్ డాలర్లతో జపాన్ మూడో స్థానంలో నిలిచినట్టు ఈ లెక్కలు చెబుతున్నాయి. కేవలం సంపదలోనే కాకుండా అత్యంత సమర్థవంతమైన మార్కెట్ వ్యవస్థ కలిగిన దేశంగా కూడా భారత్ సరికొత్త పుంతలు తొక్కిందని సర్వే వివరాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ సంపద లెక్కల్లో ప్రైవేటు వ్యక్తుల ఆస్తులు, నగదు, ఈక్విటీలు, వ్యాపార ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకున్నారు. ప్రభుత్వ నిధులను లెక్కించలేదు. అంతర్జాతీయంగా భారత మార్కెట్ల పనితీరు అద్భుతంగా ఉందని, గత ఏడాదితో పోలిస్తే 2017లో మొత్తం సంపదలో 24శాతం వృద్ధి నమోదైనట్టు తెలుస్తోంది. పది లక్షల డాలర్లు దాటిన వ్యక్తిగత సంపదన దాటిన వారి సంఖ్య భారత్‌లో 3,30,400కు పైగా ఉందని కూడా ఈ నివేదిక తెలిపింది. ఈ విషయంలో తొమ్మిదో స్థానంలో ఉన్న భారత్ దాదాపు 30వేల మంది మల్టీ మిలియనీర్లతో ఏడో ర్యాంకును సంతరించుకుంది.