జాతీయ వార్తలు

నవయుగకు పోలవరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 30: పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో స్పిల్‌వే కాంక్రీటు, స్పిల్ చానల్ పనులను నవయుగ సంస్థకు అప్పగించేందుకు కేంద్రం అంగీకరించింది. పోలవరం ప్రధాన కాంట్రాక్టర్‌గా ఉన్న ట్రాన్స్‌ట్రాయ్ సంస్థ ఇప్పటివరకు అనుకున్న విధంగా నిర్దిష్ట సమయంలో పూర్తిచేయని కారణంగా, ఈపీసీ నిబంధన 60-సి కింద స్పిల్‌వే కాంక్రీటు, స్పిల్ చానల్ పనులను ట్రాన్స్‌ట్రాయ్ సంస్థ నుంచి తప్పించి నవయుగ కంపెనీకి అప్పగించేందుకు కేంద్రం నిర్ణయం తీసుకుంది. పోలవరం ప్రాజెక్టుపై మంగళవారం కేంద్ర జల వనరుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ నేతృత్వంలో కేంద్ర, రాష్ట్ర జల వనరుల శాఖ అధికారులతో పాటు నవయుగ, ట్రాన్స్‌ట్రాయ్ కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు. ఏపీ జల వనరుల శాఖ నుంచి ఆ కార్యదర్శి శశిభూషన్ కుమార్, ఈఎన్‌సి ఎం.వెంకటేశ్వర్‌రావు తదితరులు పాల్గొన్నారు. నవయుగ సంస్థకు ఈ పనులను అప్పగించేందుకు కేంద్రం అంగీకరించడంతో వారం రోజుల్లోగా ఏపీ ప్రభుత్వం, నవయుగ సంస్థ ఒక ఒప్పందం చేసుకోనున్నాయి. అలాగే నిర్ణీత గడువులోగా పనులను పూర్తీచేసే విధంగా నవయుగ సంస్థతో ప్రభుత్వం అదేరోజు నియమ నిబంధనలను పెట్టుకోనున్నాయి. స్పిల్‌వే కాంక్రీటు, స్పిల్ చానల్ పనుల విషయంలో నవయుగ సంస్థే ప్రధాన కాంట్రాక్టర్‌గా వ్యవహరించనుంది. ట్రాన్స్‌ట్రాయ్ సంస్థ సబ్ కాంట్రాక్టర్‌గా కూడా ఉండదు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో స్పిల్‌వే కాంక్రీటు, స్పిల్ చానల్ పనులకు సంబంధించి గతంలో రాష్ట్ర ప్రభుత్వం టెండర్లు పిలిచింది. దీనిపై కేంద్రం కూడా అభ్యంతరాలు తెలిపిన విషయం తెలిసిందే. అనంతరం ఈ ప్రాజెక్టు ప్రధాన కాంట్రాక్టర్‌గా ఉన్న ట్రాన్స్‌ట్రాయ్ సంస్థకు నెల రోజుల గడువు ఇచ్చినప్పటికీ పనులలో వేగం పెరగకపోవడంతో కొత్త టెండర్లపై ప్రాజెక్టు అథారిటీ సమావేశం నిర్వహించారు. అయితే ఈ పనులను పాత ధరలకే పూర్తిచేస్తామని నవయుగ సంస్థ ముందుకు రావడంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ టెండర్ల ప్రక్రియను తాత్కాలికంగా అపివేసింది. ఈ పనుల విషయంలో ట్రాన్స్‌ట్రాయ్ సంస్థకు, నవయగ సంస్థల మధ్య పలుమార్లు చర్చలు జరిగినా ఒక కొలిక్కి రాలేదు. గడ్కరీ అధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఈపీసీలోని 60-సి కింద ఈ పనులను చేపడుతున్న ట్రాన్స్‌ట్రాయ్ సంస్థను తొలగించి నవయుగ సంస్థకు పాత ధరలకు పనులను అప్పగించేందుకు మొగ్గుచూపారు. ఇక ఏపీ ప్రభుత్వం, నవయుగ సంస్థలు ఒప్పందం కుదుర్చుకుని ఈ పనులు చెపట్టేందుకు కేంద్రం అంగీకారం తెలిపింది.