జాతీయ వార్తలు

‘షాట్‌గన్’తో జతకట్టిన యశ్వంత్ సిన్హా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 30: నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వ విధానాలను తూర్పారపట్టడమే లక్ష్యంగా చేసుకున్న కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా ‘రాష్ట్ర మంచ్’ పేరిట ఓ కొత్త రాజకీయ వేదికను మంగళవారం ఇక్కడ ప్రారంభించారు. బీజేపీలో అసంతృప్తి నేతగా ముద్ర పడిన ఎంపీ శత్రుఘ్న సిన్హాతో ఆయన చేతులు కలపడం ఇపుడు చర్చనీయాంశమైంది. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై ఉద్యమించడమే ‘రాష్ట్ర మంచ్’ ధ్యేయమని యశ్వంత్ ప్రకటించారు. పార్టీలో తన మనోభావాలను ప్రకటించేందుకు అవకాశం లేనందున తాను ‘రాష్ట్ర మంచ్’లో చేరుతున్నానని శత్రుఘ్న సిన్హా యశ్వంత్‌కు మద్దతు తెలిపారు. దేశ ప్రయోజనాల కోసం పనిచేస్తున్న తనను పార్టీ వ్యతిరేకిగా ముద్ర వేయాల్సిన అవసరం లేదని అన్నారు. యశ్వంత్ సిన్హా ఏర్పాటు చేసిన సమావేశానికి శత్రుఘ్న సిన్హాతో పాటు తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ దినేశ్ త్రివేది, కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి, ఎన్‌సీపీ ఎంపీ మజీద్ మెమన్, ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్, గుజరాత్ మాజీ సీఎం సురేశ్ మెహతా, జెడి (యు) నేత పవన్ వర్మ, ఆర్‌ఎల్‌డీ నేత జయంత్ చౌదరి, కేంద్ర మాజీ మంత్రులు సోమ్‌పాల్, హర్‌మోహన్ ధావన్ తదితరులు హాజరయ్యారు. జాతిపిత గాంధీజీ 70వ జయంతిని ‘రాష్ట్ర మంచ్’ ప్రారంభోత్సవానికి సరైన సందర్భమని యశ్వంత్ భావించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రధాని మోదీ దేశంలోని రైతులను బిచ్చగాళ్ల స్థాయికి దిగజార్చారన్నారు. ‘రాష్ట్ర మంచ్’ రాజకీయ వేదిక కాదని, ఏ పార్టీకి వ్యతిరేకం కాదని, జాతి మేలు కోసం పనిచేస్తుందని ఆయన ప్రకటించారు. ‘ఇది ఓ సంస్థ కాదు.. జాతీయ ఉద్యమం’ అని అభివర్ణించారు.
‘బీజేపీలో చాలామంది భయపడి బతుకుతున్నారు.. మేం మాత్రం కాదు.. ఏకపక్ష నిర్ణయాలు చాలా ప్రమాదకరం.. రైతుల సంక్షేమమే మా ప్రధాన ఎజెండా..’ అని అన్నారు. కాగా, మోదీ ప్రభుత్వ ఆర్థిక విధానాలపై కొంతకాలంగా యశ్వంత్ బహిరంగంగానే విమర్శలు గుప్పిస్తున్నారు. బీజేపీలో ఉంటూనే తాను దేశం కోసం పోరాడుతున్నానని ఆయన స్పష్టం చేశారు.