జాతీయ వార్తలు

వృద్ధుల సంక్షేమం పట్టదా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 30: దేశంలోని వృద్ధుల స్థితిగతుల పట్ల సరైన ఆదరణ లేదని, వారి విషయంలో రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు తగిన శ్రద్ధ వహించడం లేదని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. దేశంలో వృద్ధాశ్రమాలకు సంబంధించిన వివరాలతో అఫిడ్‌విట్ దాఖలు చేయాలని తాము కోరినప్పటికీ ఇంతవరకు పలు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు స్పందించకపోవడం పట్ల ఆవేదన వ్యక్తం చేసింది. దీన్నిబట్టి చూస్తే వృద్ధుల పట్ల అధికారుల్లో నిరాదరణ ధోరణి కనిపిస్తోందని పేర్కొంది. ఇప్పటివరకు వృద్ధాశ్రమాలకు సంబంధించి 23 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు అఫిడవిట్లు దాఖలు చేశాయని, 11 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ఇప్పటికీ వివరాలు ఇవ్వలేదని సుప్రీం కోర్టుకు నివేదించిన నేపథ్యంలో సర్వోన్నత న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది. ఈ కేసు విచారణ సమయంలో గోవా, హిమాచల్‌ప్రదేశ్, అరుణాచల్‌ప్రదేశ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన న్యాయవాదులు కూడా హాజరుకాకపోవడం పట్ల న్యాయమూర్తులు మదన్ లోకూర్, దీపక్ గుప్తాలతో కూడిన ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు వృద్ధులపట్ల ఎలాంటి లక్ష్యం లేనట్లుగా కనిపిస్తోందని వ్యాఖ్యానించింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర సహా అఫిడవిట్లు దాఖలు చేయని రాష్ట్రాలకు మూడు వారాల గడువిస్తున్నట్లు తెలిపింది. దేశంలోని ప్రతి జిల్లాలోగల వృద్ధాశ్రమాలకు సంబంధించిన వివరాలు, వాటి స్థితిగతులకు సంబంధించి అఫిడవిట్లు దాఖలు చేయాలని గత ఏడాది సెప్టెంబర్‌లో రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను సుప్రీం కోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే.