జాతీయ వార్తలు

వర్గీకరణ బిల్లుకు మోక్షం కల్పించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 30: షెడ్యూల్డు కులాల రిజర్వేషన్లను ఏబీసీడీలుగా వర్గీకరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ కాంగ్రెస్ లోక్‌సభ సభ్యుడు నంది ఎల్లయ్య మంగళవారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారు. న్యాయమూర్తి ఉషా మెహ్రా నివేదికను ఆమోదించి వర్గీకరణ సవరణ బిల్లు పార్లమెంటులో ప్రతిపాదించాలని ఆయన కోరారు. ఉషా మెహ్రా నివేదిక గత తొమ్మిది సంవత్సరాల నుంచి కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉందని ఆయన చెప్పారు. ఎస్సీ వర్గీకరణ జరిగితే అట్టడుగున ఉన్న వారికి ఎంతో మేలు జరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. కాగా గద్వాల్-మాచర్ల మధ్య సంయుక్తరంగంలో రైల్వే లైను నిర్మించాలని నంది ఎల్లయ్య రైల్వే శాఖ మంత్రి పియూష్ గోయల్‌కు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు వినతిపత్రం అందజేశారు. ప్రాజెక్టును ఈసారి రైల్వే బడ్జెట్‌లో చేర్పించాలని కూడా ఆయన కోరారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అనుమతి లభించనందుకే ఎంఓయుపై సంతకం జరగటం లేదని ఎల్లయ్య ఆరోపించారు. మనోహరాబాద్- కొత్తపల్లి ప్రాజెక్టు వల్ల నాగర్‌కర్నూల్ లోక్‌సభ నియోజకవర్గానికి అన్యాయం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. నాగర్ కర్నూల్ లోకసభ నియోకవర్గంలో కేంద్రీయ విద్యాలయాన్ని ఏర్పాటు చేయాలని మరో లేఖను కేంద్ర మానవ వనరుల మంత్రి జావడేకర్‌కు రాశారు.