జాతీయ వార్తలు

ఎస్సీ, ఎస్టీల సంరక్షణలో తెలంగాణ టాప్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 30: దళిత, గిరిజనుల రక్షణ కొరకు తీసుకుంటున్న చర్యల్లో తెలంగాణ అగ్రస్థానంలో ఉందని రాష్ట్ర షెడ్యూలు కులాల అభివృద్ధి శాఖ మంత్రి జి.జగదీష్‌రెడ్డి అన్నారు. కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత శాఖ మంత్రి థావర్ చంద్ గెహ్లాట్ అధ్యక్షతన మంగళవారం ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్, ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ చట్టాల అమలు తీరుతెన్నులపై ఢిల్లీలోని అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్‌లో జాతీయ స్థాయి సదస్సు జరిగింది. ఈ సదస్సులో రాష్ట్ర మంత్రి జగదీష్‌రెడ్డి పాల్గొన్నారు. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, బిహార్, గుజరాత్, కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిషా, రాజస్థాన్, తమిళనాడు రాష్ట్రాల్లో ఈ చట్టాల అమలులో ఏర్పడుతున్న ఇబ్బందులు, సమస్యలపై ప్రధానంగా చర్చ జరిగింది.