జాతీయ వార్తలు

నిగ్గుదేలిన నల్లధనం ఎంత?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 30: పెద్దనోట్ల రద్దు తర్వాత దేశవ్యాప్తంగా ఎంతమేరకు నల్లధనం సేకరించారో తెలియజేయాలని కేంద్ర సమాచార కమిషన్ (సీఐసీ) ఆర్థిక మంత్రిత్వ శాఖను ఆదేశించింది. సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) కింద ఏడాది క్రితం దాఖలైన దరఖాస్తుపై స్పందిస్తూ ఈ ఉత్తర్వులను సీఐసీ జారీచేసింది. అయితే, ఆ దరాఖాస్తుపై ఏడాది కాలంగా స్పందించనందుకు ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంవో) క్షమాపణ చెప్పడంతో ఎలాంటి జరిమానా విధించడం లేదని కేంద్ర సమాచార కమిషనర్ ఆర్కే మాథుర్ మంగళవారం ప్రకటించారు. ఆర్‌టీఐ చట్టం ప్రకారం నిర్ణీత కాలవ్యవధిలోగా సమాచారం ఇచ్చేలా ఇకముందు అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని ప్రతివాది అయిన కేంద్ర ప్రజాసంబంధాల అధికారి (సీపీఐవో)ను కమిషనర్ హెచ్చరించారు.
ఆర్‌టీఐ చట్టం ప్రకారం సమాచారాన్ని కోరే దరఖాస్తులపై 30 రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని, ఆలస్యానికి పేర్కొనే కారణాలు సహేతుకంగా లేవంటే జరిమానా తప్పదని కమిషనర్ మాథుర్ గుర్తుచేశారు. 2016 నవంబర్ 8న ప్రధాని నరేంద్ర మోదీ పెద్దనోట్లను రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నల్లధనాన్ని ఎంతమేరకు సేకరించారో తెలియజేయాలంటూ ఖలీద్ ముండప్పిల్లి అనే వ్యక్తి ఆర్‌టీఐ చట్టం కింద నవంబర్ 22, 2016న దరఖాస్తు చేశాడు. అయితే, నెల రోజుల్లోగా ఆయనకు ఎలాంటి సమాచారం అందలేదు. దీంతో జనవరి 9, 2017న ప్రధానమంత్రి కార్యాలయం తీరుపై సీఐసీకి ఆయన ఫిర్యాదు చేశాడు. ఖలీద్ చేసిన దరఖాస్తును గత ఏడాది 25న రెవెన్యూ విభాగానికి పంపినట్లు పీఎంఓ అధికారులు తెలిపారు. తన దరఖాస్తును పీఎంవో అధికారులు రెవెన్యూ విభాగానికి పంపి ఏడాది గడిచినా స్పందన లేదని ఖలీద్ సీఐసీకి తెలిపాడు. ఈ నేపథ్యంలో రెవెన్యూ విభాగం, సీపీఐవో సైతం ఆర్‌టీఐ చట్టం కింద నెల రోజుల్లోగా దరఖాస్తుదారులకు తగిన సమాచారం ఇవ్వాలని సీఐసీ మాథుర్ ఆదేశించారు.