జాతీయ వార్తలు

అరాచకాలను సహించం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 30: కాశ్‌గంజ్ హింసకు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ వెల్లడించారు. కాశ్‌గంజ్ ఘటనపై బీజేపీ నాయకులే వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం, దీన్లో రాజకీయపార్టీల జోక్యం చేసుకోవడంతపై ముఖ్యమంత్రి తీవ్రంగానే స్పందించారు. కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ మీడియాపైనే విమర్శలు చేయగా, బీజేపీ సీనియర్ నేత వినయ్ కతియార్ వ్యాఖ్యలు వివాదాన్ని రేపాయి. పాకిస్తాన్‌కు మద్దతు ఇస్తున్న మూకలే హింసను ప్రేరేపిస్తున్నాయని బీజేపీ నేతలు ఆరోపించారు. పరిస్థితి మరింత జఠిలం కాకుండా యోగి వౌనం వీడారు. ‘రాష్ట్రంలోని ప్రతి పౌరుడికీ మా ప్రభుత్వం భద్రత కల్పిస్తుంది. దీనికి మేం కట్టుబడి ఉన్నాం. అరాజకత్వాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోం. అలాంటి శక్తులకు ఉత్తరప్రదేశ్‌లో చోటులేదు’ అని ఆదిత్యనాథ్ హెచ్చరించారు. కాశ్‌గంజ్‌లో ఘర్షణల తరువాత తొలిసారి సీఎం స్పందించారు. అరాచక శక్తుల పట్ల అత్యంత కఠినంగా ఉంటామని, శాంతిభద్రతలకు విఘాతం కల్గిస్తే చూస్తూ ఊరుకోబోమని ఆయన తీవ్రంగా హెచ్చరించారు. ఇలా ఉండగా ఘర్షణలు ఓ పథకం ప్రకారం జరిగాయని కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ ఆరోపించారు. విషయాన్ని తప్పుదోవపెట్టడానికి మీడియా ప్రయత్నిస్తోందని ఆయన విమర్శించారు. ఘర్షణలను సృష్టించే వారిని యోగి ప్రభుత్వం శిక్షించి తీరుతుందని కేంద్ర మంత్రి హెచ్చరించారు. ఏబీవీపీ తిరంగ యాత్ర సందర్భంగా తలెత్తిన ఘర్షణల్లో చందన్‌గుప్తా (22) అనే విద్యార్థి మృతి చెందాడు. ముస్లిం మైనారిటీలు ఎక్కువగా ఉండే కాశ్‌గంజ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే మహ్మద్ ఇస్మాయిల్ అనే వ్యక్తి చనిపోయినట్టు మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఇదంతా ఉద్దేశపూర్వకంగానే జరిగిందని గిరిరాజ్ ధ్వజమెత్తారు. ఫుడ్ ప్రాసెసింగ్ సహాయ మంత్రి సాధ్వీ నిరంజన్ జ్యోతి ఈ ఘటనను రాజకీయ కోణంలో చూడొద్దని అన్నారు. అయితే కరుడుగట్టిన హిందుత్వవాది, బీజేపీ ఎంపీ వినయ్ కతియార్ ఓ న్యూస్ చానల్‌తో మాట్లాడుతూ పాకిస్తాన్ అనుకూలవాదులే ఘర్షణల వెనక ఉన్నారని ఆరోపించారు.