జాతీయ వార్తలు

కేసు తేలకుండానే ఉరి తీశారు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 30: దేశవ్యాప్తంగా మంగళవారం నాడు జాతిపిత మహాత్మాగాంధీ జయంతిని నిర్వహించగా, ఆయన హత్య కేసుకు సంబంధించి కొత్త వాదన తెరపైకి వచ్చింది. గాంధీ హత్యకేసు పూర్తిస్థాయిలో కొలిక్కిరాకముందే ‘కుట్రదారులు’గా ఆరోపణలు ఎదుర్కొన్న నాథూరామ్ గాడ్సే, నారాయణ్ దత్తాత్రేయ ఆప్టేలను ఉరి తీశారని ముంబయికి చెందిన డాక్టర్ పంకజ్ ఫడ్నీస్ సుప్రీంలో దాఖలు చేసిన అఫిడవిట్‌లో తెలిపారు. గాంధీ హత్యపై పునర్విచారణ జరపాలంటూ దాఖలైన ఈ ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని (పిల్) సుప్రీం కోర్టు స్వీకరించింది. సర్వోన్నత న్యాయస్థానానికి ఈ కేసులో ఫడ్నీస్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
దేశంలో సుప్రీం కోర్టు ఆవిర్భావానికి ముందే (జనవరి 26, 1950) గాంధీ హత్యకేసులో నిందితులైన గాడ్సే, ఆప్టేలను 1949, నవంబర్ 15న ఉరితీశారు. ముంబయికి చెందిన ‘అభినవ భారత్’ చారిటబుల్ ట్రస్టుకు చెందిన డాక్టర్ పంకజ్ ఫడ్నీస్- ‘గాంధీ హత్యకేసును పునర్విచారణకు స్వీకరించరాదం’టూ సీనియర్ న్యాయవాది అమరేందర్ శరణ్ చేసిన వాదనను ఖండిస్తూ తన అఫిడవిట్‌లో పలు విషయాలు పేర్కొన్నారు. ఢిల్లీలోని బిర్లా హౌస్ వద్ద 1948 జనవరి 30న గాంధీజీ హత్యకు గురయ్యారు. గాంధీ హత్యకేసులో గాడ్సే, ఆప్టేలకు మరణశిక్ష విధిస్తూ ఈస్ట్ పంజాబ్ హైకోర్టు 1949 జూన్ 21న తీర్పు ప్రకటించింది.
అయితే ఆ తీర్పుపై ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించేందుకు గాడ్సే, ఆప్టే కుటుంబాలకు ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. 1950 జనవరి 26న సుప్రీం కోర్టు ఏర్పడినప్పటికీ, గాంధీ హత్యకేసుపై ‘న్యాయపరమైన అంతిమ నిర్ణయం’ తీసుకునే అవకాశం కల్పించలేదని ఫడ్నీస్ పేర్కొన్నారు. దేశంలో ఫెడరల్ కోర్టు బదులు సుప్రీం కోర్టు ఏర్పాటవుతుందని తెలిసినా గాంధీ హత్య కేసును విచారించేందుకు అవకాశం ఇవ్వలేదన్నారు. ‘కొలిక్కిరాకుండానే ఆ కేసును తేల్చేశారు’ అని ఆయన పేర్కొన్నారు. 2000లో ఎర్రకోటపై దాడి కేసులో సుప్రీం కోర్టు 2017లో ఇచ్చిన తీర్పును ఫడ్నీస్ తన వాదనకు మద్దతుగా ఉదహరించారు. మరణశిక్ష ప్రకటించిన కేసుల్లో బహిరంగ విచారణ జరపాలన్న వాదనను ఆయన వినిపించారు. గాంధీ హత్య కేసులో అమాయకులైన గాడ్సే, ఆప్టే మరణశిక్షకు ముందు సుప్రీం కోర్టును ఆశ్రయించడానికి 71రోజుల పాటు బతికే ఉన్నా, వారికి ఆ అవకాశం ఇవ్వలేదన్నారు. కేసు కొలిక్కిరాకుండానే ఆ ఇద్దర్నీ ఉరి తీయడంతో అనేక అనుమానాలు తలెత్తుతున్నాయని ఫడ్నీస్ సుప్రీం కోర్టుకు తెలిపారు.