జాతీయ వార్తలు

ఏం జరిగినా డోంట్ వర్రీ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 30: మంచి రోజులు వస్తున్నాయన్న 2018 ఆర్థిక సర్వేపై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ వ్యంగ్యోక్తులు విసిరారు. 2018-19లలో 7.5 శాతం అభివృద్ధితో మంచి రోజులు వస్తున్నాయని ప్రధాన మంత్రి నాయకత్వంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం సోమవారం లోక్‌సభలో ప్రతిపాదించిన ఆర్థిక సర్వే ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనిపై రాహుల్ గాంధీ మంగళవారం ట్వీట్ చేశారు. ‘ఆర్థిక సర్వే ప్రకటించిన మంచి రోజులకు కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు మాత్రమే ఉన్నాయి. తగ్గుతున్న పారిశ్రామిక అభివృద్ధి, తగ్గుతున్న వ్యవసాయాభివృద్ధి, తగ్గుతున్న జీడీపీ, తగ్గుతున్న ఉపాధి కల్పన లాంటి చిన్న చిన్న ఇబ్బందులు మాత్రమే ఉన్నాయి. దీనికి ఆందోళన వద్దు, సంతోషంగా ఉండు’ అంటూ రాహుల్ సెటైర్లు విసిరారు. అమెరికాకు చెందిన జాజ్ వోకలిస్ట్, సంగీత నిర్వాహకుడు రాబర్ట్ కీథ్ బాబ్బీ మిక్ ఫెర్ని జూనియర్ 1988లో రాసి పాడిన ‘డోన్ట్ వర్రి బీ హ్యాపీ’ పాటను కాంగ్రెస్ అధినేత ఈ సందర్భంగా ట్వీట్ కోసం ఉపయోగించుకున్నారు. మిక్ ఫెర్ని రాసి స్వీయ సంగీతంలో పాడిన ఈ పాట అప్పట్లో రికార్డులు బద్దలు కొట్టింది. ‘తల దాచుకునేందుకు ఇల్లు లేకున్నా బాధ పడవద్దు, సంతోషంగా ఉండు, ఎవరో వచ్చి నీ పరుపు తీసుకుపోయినా, ఇంటి అద్దె కట్టక యజమాని కోర్టుకు వెళ్లినా ఆందోళన చెందకు, సంతోషంగా ఉండు’ అన్నది ఆ పాట సారాంశం. దీన్నీ రాహుల్ గాంధీ 2018 ఆర్థిక సర్వేను విమర్శించేందుకు సందర్భానుచితంగా వాడుకున్నారు.