జాతీయ వార్తలు

రిజర్వేషన్లను 52 శాతానికి పెంచాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 31: దేశంలోని వెనుకబడిన కులాల రిజర్వేషన్లను 52 శాతానికి పెంచి వర్గీకరించాలని జాతీయ ఎంబీసీ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి సంగం సూర్యారావు, ఇతర నాయకులు వంశరాజ్, అంతయ్య, రవిశంకర్, నరసింహసాగర్, సతీష్ డిమాండ్ చేశారు. జాతీయ ఎంబీసీ సంక్షేమ సంఘం నాయకులు బుధవారం ఓబీసీ రిజర్వేషన్ల వర్గీకరణ కమిటీ అధ్యక్షురాలు, న్యాయమూర్తి రోహిణిని కలిసి ఈ మేరకు ఒక వినతిపత్రం అందజేశారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం ఓబీసీ రిజర్వేషన్లను వర్గీకరించేందుకు న్యాయమూర్తి రోహిణి అధ్యక్షతన ఒక కమిటీని ఏర్పాటు చేయటం తెలిసిందే. ఓబీసీలకు ఇప్పుడు జాతీయ స్థాయిలో ఇస్తున్న 27 శాతం రిజర్వేషన్లను వర్గీకరించటం వలన పెద్దగా ప్రయోజనం ఉండదని వారు సూచించారు. ఓబీసీ రిజర్వేషన్లను వర్గీకరించటం చిక్కులతో కూడుకున్న విషయం కాబట్టి దీనిని జాగ్రత్తగా చేయవలసి ఉంటుందన్నారు. ఓబీసీ రిజర్వేషన్లను వారి జనాభా ఆధారంగా 52 శాతానికి పెంచి వర్గీకరిస్తే మంచి ఫలితాలు ఉంటాయనేది ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం గ్రహించాలని వారు సూచించారు. ఓబీసీల క్రీమీలేయర్ పరిమితిని పది లక్షల రూపాయలకు పెంచాలని కూడా వారు డిమాండ్ చేశారు. ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించడంతోపాటు రాజకీయ రిజర్వేషన్లు కల్పించినప్పుడే సాధికారిత కలుగుతుందని వారు న్యాయమూర్తి రోహిణికి సూచించారు. ఓబీసీ రిజర్వేషన్ల వర్గీకరణాన్ని వీలున్నంత త్వరగా పూర్తిచేసి ప్రభుత్వానికి అందజేస్తానని న్యాయమూర్తి రోహిణి వారికి హామీ ఇచ్చారు.