జాతీయ వార్తలు

మహిళా కమిషన్‌కు రాజకీయ ప్రాపకం వద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 31: జాతీయ మహిళా కమిషన్ ఏర్పడి పాతికేళ్లు పూరె్తైన సందర్భంగా ఇప్పటివరకూ మహిళల హక్కుల పరిరక్షణలో అది నిర్వహించిన పాత్ర, రాజకీయంగా లభిస్తున్న ఆదరణపై కేంద్ర మంత్రి మేనకాగాంధీ బుధవారం ఇక్కడ అనేక కీలక ప్రశ్నలను ఎదుర్కోవాల్సి వచ్చింది. గత పనె్నండేళ్లుగా గిరిజావ్యాస్, మమతా శర్మ, లలితా కుమార మంగళం సహా జాతీయ మహిళా కమిషన్‌కు చైర్‌పర్సన్లుగా వ్యవహరించిన వారంతా ఆయా సందర్భాల్లోని కేంద్ర ప్రభుత్వాలతో ప్రత్యక్ష సంబంధాలు కలిగి ఉన్నవారే. అయితే జాతీయ మహిళా కమిషన్ చైర్‌పర్సన్లు ఇలా ప్రత్యక్ష రాజకీయ సంబంధాలను కలిగి ఉండటంపై విమర్శలు తలెత్తుతున్నాయి. ఎన్‌సిడబ్ల్యు చైర్‌పర్సన్ పూర్తిస్థాయిలో స్వతంత్రంగా వ్యవహరించాలేగానీ, ఏ రకమైన రాజకీయ ప్రాపకాన్ని, ప్రాబల్యాన్ని కలిగి ఉండకూడదన్నది తన అభిప్రాయమని గతంలో ఈ కమిషన్‌కు సారథ్యం వహించిన మోహిని వి గిరి స్పష్టం చేశారు. 1995 నుంచి 98 వరకూ జాతీయ మహిళా కమిషన్ రెండో చైర్‌పర్సన్‌గా ఆమె వ్యవహరించారు. కమిషన్‌కు మరిన్ని అధికారాలు కల్పించాల్సిన అవసరం ఉందని, ఈ విషయం పట్ల కేంద్ర మంత్రి మేనకా గాంధీ ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందని ఆమె తెలిపారు. జాతీయ మహిళా కమిషన్ కూడా జాతీయ మానవ హక్కుల కమిషన్ మాదిరిగానే వ్యవహరించాలని, ఎవరికైనా అందుబాటులో ఉంటూ, ఎవరికైనా సహాయపడే విధంగా ఈ కమిషన్‌ను తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందని ఆమె తెలిపారు. గత సెప్టెంబర్‌లో లలితా కుమార మంగళం మూడేళ్ల పదివీకాలం పూరె్తైన తరువాత ఇప్పటి వరకూ జాతీయ మహిళా కమిషన్‌కు చైర్‌పర్సన్ లేకపోవడం పట్ల ఆందోళన వ్యక్తమవుతోంది. 2014లో ఈ పదవిలో నియమితమైన సమయానికి లలితా కుమార మంగళం బీజీపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలిగా ఉన్నారు. ఆమెకు ముందు 2011 నుంచి 14 వరకూ మమతా శర్మ ఈ పదవి నిర్వహించారు.