జాతీయ వార్తలు

ఏం చేద్దాం.. చెప్పండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 31: విభజన చట్టంలో ఇచ్చిన హామీమేరకు తెలంగాణ, ఆంధ్ర అసెంబ్లీ సీట్ల పెంపు, తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ పరిస్థితులు, పార్టీ పరిస్థితిపై చర్చించేందుకు జాతీయ అధ్యక్షుడు అమిత్ షా గురువారం రెండు రాష్ట్రాల బీజేపీ నేతలతో సమావేశం కానున్నారు. చర్చల అనంతరం అసెంబ్లీ సీట్ల పెంపుపై ఒక నిర్ణయం రావొచ్చన్న వాదనా వినిపిస్తోంది. సీట్ల పెంపునకు బీజేపీ సుముఖంగా ఉందని కొందరు అంటున్నా, పార్టీ వర్గాలు మాత్రం ఖరారు చేయటం లేదు. శుక్రవారం సాయంత్రం 4 గంటలకు పార్టీ నేతలతో అమిత్ షా సమావేశమవుతారు. రాష్ట్రాలవారీ, విడివిడిగా జరుపనున్న సమావేశాల్లో సీట్ల పెంపువల్ల పార్టీకి ఏమేరకు ప్రయోజనం ఉంటుందనేదీ తెలుసుకుంటారని అంటున్నారు. సీట్ల పెంపువల్ల ఆంధ్రలో తెదేపా, తెలంగాణలో తెరాస మాత్రమే లాభపడతాయని, బీజేపీకి కలిసొచ్చేదేదీ లేదని రెండు రాష్ట్రాల నేతలు మొదటి నుంచీ వాదించటం తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లో పార్టీ పరిస్థితి, మిత్రపక్షాలతో ఏమేరకు పొత్తు కొనసాగించొచ్చు? పార్టీ ఏమేరకు బలోపేతమైంది? మరింత బలోపేతానికి ఎలాంటి చర్యలకు వీలుంది? క్షేత్రస్థాయిలో పార్టీ, కార్యకర్తల పరిస్థితి? రెండుచోట్లా నెలకొన్న రాజకీయ పరిస్థితులు? తదితర అంశాలపై సుదీర్ఘ చర్చలు జరుపనున్నారు. నేటి సమావేశానికి తెంలగాణ బీజేపీ అధ్యక్షుడు కె లక్ష్మణ్, అసెంబ్లీ పక్షనేత జి కిషన్ రెడ్డి, మాజీ కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు, ఎమ్మెల్సీ రామచందర్‌రావు, మంత్రి శ్రీనివాస్, ఏపీ అధ్యక్షుడు, ఎంపీ కె హరిబాబు, అసెంబ్లీ పక్షనేత విష్ణుకుమార్ రాజు, మాజీ కేంద్ర మంత్రి పురంధ్రీశ్వరి, ఎమ్మెల్సీ సోము వీర్రాజు హాజరవుతున్నారు. ఆంధ్ర బృందంతో జరిపే చర్చల్లో తెలుగుదేశంతో పొత్తు కొనసాగించాలా? వద్దా? అనే దానిపైనా లోతైన చర్చ జరగవచ్చన్న మాట వినిపిస్తోంది. ముఖ్యంగా పురంధ్రీశ్వరి, సోము వీర్రాజు గుప్పిస్తున్న విమర్శలు తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, సీఎం చంద్రబాబుకు ఎంతమాత్రం మింగుడుపడటం లేదు. తాము మిత్రధర్మాన్ని పాటిస్తున్నాం, ఓపికున్నంత కాలం భరిస్తాం, ఓపిక నశిస్తే నమస్కారం పెట్టి వెళ్లిపోతామని పరోక్షంగా హెచ్చరించటం తెలిసిందే. ఇదిలావుంటే తెలుగుదేశం ప్రభుత్వం పనిచేస్తున్న తీరు, రాష్ట్రంలో అవినీతి విచ్చలవిడిగా కొనసాగటం, మంత్రులపై వస్తున్న అవినీతి ఆరోపణలు, తెలుగుదేశంతో పొత్తు కొనసాగించటం వలన బీజేపీపై పడుతున్న చెడు ప్రభావం తదితర అంశాలను రాష్ట్ర నేతలు జాతీయ నాయకత్వం దృష్టికి తేనున్నారు. తెదేపా ప్రభుత్వం రాష్ట్ర బీజేపీని ఏమాత్రం ఖాతరు చేయటం లేదనేదీ జాతీయ నాయకత్వానికి వివరించనున్నారు. తెలంగాణ నేతలు రాష్ట్ర రాజకీయ పరిస్థితులు, సీఎం కేసీఆర్ సర్కారు పనితీరు, పొత్తుల విషయం చర్చకు రావచ్చని అంటున్నారు.