జాతీయ వార్తలు

ఆపన్నులా.. సంపన్నులా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 31: ప్రధాని నరేంద్ర మోదీ జమిలి ఎన్నికల గురించి ఆలోచిస్తున్న తరుణంలో ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ గురువారం లోక్‌సభలో అందరి మన్ననలు పొందే మంచి బడ్జెట్‌ను ప్రవేశపెట్టే అవకాశాలు అధికంగా ఉన్నాయి. అరుణ్ జైట్లీ ఉదయం 11 గంటలకు లోక్‌సభలో 2018-19 వార్షిక ప్రణాళికను ప్రతిపాదిస్తారు. లోక్‌సభ ఉదయం సమావేశం కాగానే మొదట మహారాష్ట్ర బీజేపీ ఎంపీ అకాల మరణంపై సంతాపం తెలిపిన అనంతరం జైట్లీ బడ్జెట్‌ను ప్రతిపాదిస్తారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న ఆఖరు పూర్తిస్థాయి బడ్జెట్ ఎలా ఉంటుందనే అంశంపై రకరకాల చర్చలు జరుగుతున్నాయి. బడ్జెట్‌లో రైతులు, వ్యవసాయ రంగానికి పెద్దపీట వేయటంతోపాటు ఆదాయం పన్ను మినహాయింపును రెండు లక్షల నుండి రెండున్నర లక్షలకు పెంచే అవకాశాలున్నాయని ఆర్థిక శాఖ అధికారులు సూచనప్రాయంగా చెబుతున్నారు. దీనితోపాటు ఉద్యోగులకు స్టాండర్డ్ డిడక్షన్ విధానాన్ని మరోసారి ప్రవేశపెట్టే అవకాశాలు లేకపోలేదని ఫిక్కి అధికారులు చెబుతున్నారు. ఉద్యోగస్థులకు స్టాండర్డ్ డిడక్షన్ విధానం 2015-06 వార్షిక సంవత్సరం వరకు అమలులో ఉండింది. అయితే ఆ మరుసటి సంవత్సరం నుండి ఉద్యోగులకు ఈ సదుపాయాన్ని తొలగించారు. అయితే వ్యాపారస్థులకు మాత్రం ఈ విధానం ఇప్పటికీ కొనసాగుతోంది. వ్యాపారస్థులకు ఇప్పుడిస్తున్న విధంగానే ఉద్యోగులకు కూడా స్టాండర్డ్ డిడక్షన్ విధానాన్ని అమలుచేయాలని ఫిక్కితోపాటు ఇతర సంస్థలు అరుణ్ జైట్లీని కోరాయి. దీనివలన ఉద్యోగులకు కొంతైనా ఉపశమనం కలుగుతుందని వారు చెబుతున్నారు. వ్యాపారస్థులకు స్టాండర్డ్ డిడక్షన్ సౌకర్యం కొనసాగిస్తున్నప్పుడు ఉద్యోగులకు వర్తింపచేయకపోవటం వివక్షే అవుతుందని వారు స్పష్టం చేస్తున్నారు. అయితే అరుణ్ జైట్లీ ఆదాయం పన్ను మినహాయింపు పరిమితిని పెంచుతారా లేక స్టాండర్డ్ డిడక్షన్ విధానాన్ని పునరుద్ధరిస్తారా అనేది వేచి చూడవలసిందే. నరేంద్ర మోదీ జమిలి ఎన్నికలకు వెళ్లినా లేక శాసనసభ ఎన్నికలు, లోక్‌సభ ఎన్నికలను విడివిడిగా జరుపుకున్నా ప్రజల మద్దతు సంపాదించాలంటే బడ్జెట్‌లో కొంతైనా ఉదారత్వంతో వ్యవహరించకతప్పదని భావిస్తున్నారు. నరేంద్ర మోదీ జనాకర్షణ బడ్జెట్‌కు వ్యతిరేకం.. అందుకే అరుణ్ జైట్లీ జనాకర్షణ పథకాలు, నిర్ణయాలను బడ్జెట్‌లో పొందుపరచకపోయినా సగటు ఓటరు మన్ననలు పొందేందుకు మంచి బడ్జెట్‌ను ప్రతిపాదించవలసి ఉంటుంది. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో రైతులు కొట్టిన దెబ్బను మరిచిపోని ఎన్‌డీఏ ప్రభుత్వం రేపటి బడ్జెట్‌లో రైతులు, వ్యవసాయ రంగానికి మేలుచేసే నిర్ణయాలు ప్రకటించే అవకాశాలున్నాయని అంటున్నారు. వ్యవసాయ రంగం అభివృద్ధి 2.1 శాతం మాత్రమే ఉన్నందున ఈ రంగం పుంజుకునేందుకు ప్రభుత్వం ఇందుకు సంబంధించిన కొన్ని నిర్ణయాలను ప్రకటించకతప్పదని అంటున్నారు. జీఎస్‌టీటి మూలంగా పట్టణ ప్రాంతాలతోపాటు గ్రామీణ ప్రాంతాల ప్రజలు కూడా పలు ఇక్కట్లకు గురయ్యారు. అందుకే వారు తమ ప్రభుత్వం పట్ల ఆగ్రహంతో ఉన్నారని బీజేపీ భావిస్తోంది. వీరి కోపాన్ని తగ్గించే దిశగా అరుణ్ జైట్లీ కొన్ని నిర్ణయాలు తీసుకోవలసి ఉంటుందని బీజేపీ నాయకులు చెబుతున్నారు. ఇదిలాఉంటే దేశంలో ఉపాధి అవకాశాల పెరుగుదల, పారిశ్రామికాభివృద్ధి పుంజుకునేందుకు అవసరమైన చర్యలను బడ్జెట్‌లో పొందుపరిచే అవకాశాలున్నాయని అటున్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లో బ్యారెల్ ముడి చమురు ధర 70 డాలర్లకు చేరుకోవటంతో ఆర్థిక ఇరకాటంలో పడిన నరేంద్ర మోదీ ప్రభుత్వం 2018 వార్షిక బడ్జెట్‌లో ఏ మేరకు రాయితీలు ప్రకటించ గలుగుతుందనేది చర్చనీయాంశంగా మారింది. ఇది ఎన్నికల సంవత్సరమైనందున అరుణ్ జైట్లీ రేపటి బడ్జెట్‌లో కొన్ని రాయితీలైనా ప్రకటించకతప్పదని అంటున్నారు. మార్కెట్ సంస్కరణలు చేపట్టటం ద్వారా రైతులకు గిట్టుబాటు ధరలు లభించేలా చూసేందుకు కొన్ని చర్యలు ప్రకటించవచ్చునని అంటున్నారు. రైతులకు పెద్దఎత్తున రుణ సౌకర్యాలు ప్రకటించటంతోపాటు పంటల బీమా పథకం పరిధిని విస్తరించటం ద్వారా రైతుల మెప్పు పొందేందుకు ప్రయత్నించవచ్చుననే మాట వినిపిస్తోంది. కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి దేశంలోని వివిధ వర్గాల ప్రజలకు ఇచ్చే రాయితీల శాతం 15.50 శాతం నుండి 11.20 శాతానికి పడిపోయింది. అయితే మోదీ ప్రభుత్వం వివిధ రాష్ట్రాల శాసనసభల ఎన్నికలు, ఆ తరువాత వచ్చే లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని రాయితీల శాతాన్ని కొంతైనా పెంచకతప్పదని చెబుతున్నారు.