జాతీయ వార్తలు

ప్రగతిశీల బడ్జెట్: రాజ్‌నాథ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 1: ఇది ప్రగతిశీల బడ్జెట్ అని హోమ్‌మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పష్టం చేశారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల మధ్య వ్యత్యాసం, దూరాన్ని తగ్గించేందుకు బడ్జెట్ ఓ వారధిగా ఉపయోగపడుతుందని రాజ్‌నాథ్ చెప్పారు. ఆర్థికవృద్ధిని, పెట్టుబడులు పెరగడానికి బడ్జెట్ దోహదం చేస్తుందని హోమ్‌మంత్రి పేర్కొన్నారు. వౌలిక రంగాలకు కేటాయింపులు సంతృప్తినచ్చినట్టు ఆయన తెలిపారు. భారత్‌కు అనుకూలమైన బడ్జెట్‌గా అభివర్ణించిన హోమ్‌మంత్రి ‘ఆర్థిక ప్రాధాన్యతలు ఇస్తూ జైట్లీ సాహసోపేతమైన నిర్ణయాలు అనేకం తీసుకున్నారు’ అని సింగ్ స్పష్టం చేశారు. ‘నవ భారతానికి చారిత్రక బడ్జెట్‌ను ఇచ్చిన ప్రధాని మోదీ, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం’ అంటూ మీడియా సమావేశంలో వెల్లడించారు. సమాజంలో పేద ప్రజలు ఉద్ధరణకే మోదీ సర్కార్ కట్టుబడి ఉందన్న విషయాన్ని బడ్జెట్ రుజువుచేస్తోందని ఆయన తెలిపారు. ప్రధాన మంత్రి ఉజ్వల యోజన కింద 10 కోట్ల మంది పేదలకు ఎల్‌పీజీ కనెక్షన్లు కల్పించాలన్న నిర్ణయాన్ని హర్షించారు.

చిత్రం.. హోమ్‌మంత్రి రాజ్‌నాథ్ సింగ్