జాతీయ వార్తలు

చారిత్రక ముందడుగు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 1: పార్లమెంటులో ప్రవేశపెట్టిన 2018-19 ఆర్థిక బడ్జెట్ దేశంలోని అన్ని వర్గాల ప్రజల ఆకాంక్షలు తీర్చేదిగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఉద్ఘాటించారు. రైతులు, వౌలిక రంగం, గ్రామీణం, చిన్న, మధ్యతరగతి పరిశ్రమలకు బడ్జెట్ ఊతమిస్తుందని గురువారం ఇక్కడ స్పష్టం చేశారు. అరుణ్ జైట్లీ కేంద్ర బడ్జెట్ సభలో ప్రవేశపెడుతున్న సందర్భంలో అమిత్ షా అనేకసార్లు ట్వీట్ చేశారు. ‘అందరికీ ముఖ్యంగా పేదలు, వ్యవసాయదారులు, గ్రామీణ భారతం అభివృద్ధిని దృష్టిలోపెట్టుకుని బడ్జెట్ రూపకల్పన జరిగింది. దీనికి మోదీ, జైట్లీని ప్రశంసించలేకుండా ఉండలేం’ అని బీజేపీ అధ్యక్షుడు వ్యాఖ్యానించారు. వ్యవసాయ రంగానికి భారీగా కేటాయింపులు జరపడం ముదావహం అని ఆయన చెప్పారు. రైతుల ఆదాయం రెట్టింపు చేయాలన్న మోదీ ప్రభుత్వం సంకల్పం, బడ్జెట్ రూపకల్పన అమోఘంగా ఉందని ఆయన పేర్కొన్నారు. ఇది ఒక విధంగా చారిత్రాత్మక ముందడుగు అని షా స్పష్టం చేశారు. మధ్యతరగతి జీవికి ఊరటనిచ్చే నిర్ణయాలు ఎన్నో జైట్లీ బడ్జెట్‌లో ఉన్నాయని బీజేపీ చీఫ్ అభిప్రాయపడ్డారు. దేశ జనాభాలో 40 శాతం మందిని ఆయుష్‌మాన్ భారత్‌లోకి తెచ్చి ఒక్కొక్కరికి ఐదేసి లక్షల రూపాయల ఆరోగ్య బీమా కల్పించడం అద్భుతమైన చర్యగా ఆయన చెప్పారు. సౌభాగ్య యోజన పథకం కింద 4కోట్ల కుటుంబాలకు విద్యుత్ కనెక్షన్ కల్పించడాన్ని అమిత్ షా శ్లాఘించారు. పేద ప్రజల జీవితాల్లో వెలుగు నింపడానికే మోదీ అనేక కార్యక్రమాలు చేపట్టారని ఆయన వెల్లడించారు.

చిత్రం..బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా