జాతీయ వార్తలు

8 కోట్ల మందికి ‘ఉజ్వల’ కనెక్షన్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 1: ఉజ్వల పథకం కింద 8కోట్ల మంది పేద మహిళలకు ఎల్‌పీజీ కనెక్షన్లు అందించడమే లక్ష్యమని ఆర్థిక మంత్రి జైట్లీ వెల్లడించారు. మొదట 5 కోట్ల మంది పేద మహిళలకు ఈ పథకాన్ని వర్తింపచేయాలని భావించినప్పటికీ ఫలితాలు ఆశాజనకంగా ఉన్నందున ఎల్‌పీజీ కనెక్షన్ల లక్ష్యాన్ని 8 కోట్లకు పెంచామని స్పష్టం చేశారు. అలాగే మహిళా ఉద్యోగులు కట్టే పిఎఫ్ చందాను మొదటి మూడేళ్లకు గాను 8 శాతానికి తగ్గిస్తున్నట్టు మంత్రి పేర్కొన్నారు. గ్రామీణ రంగంలో మహిళలకు ఉపాధి కల్పించేందుకు వారి ఆదాయాన్ని పెంచేందుకు ఈపీఎఫ్ చట్టంలో ఈమేరకు సవరణను ప్రతిపాదిస్తున్నట్టు ఆర్థిక మంత్రి చెప్పారు. అయితే యాజమాన్యాల వాటాతో ఎలాంటి మార్పూ ఉండదని జైట్లీ తెలిపారు.