జాతీయ వార్తలు

రాష్టప్రతి జీతం రూ.5 లక్షలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 1: రాష్టప్రతి, ఉప రాష్టప్రతి, గవర్నర్ల జీతాలు పెరిగాయి. రాష్టప్రతి జీతాన్ని 5లక్షలు, ఉప రాష్టప్రతి జీతాన్ని 4లక్షలకు పెంచుతూ ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ బడ్జెట్‌లో కొత్త ప్రతిపాదన చేశారు. 2006 జనవరి 1నే రాష్టప్రతి, ఉప రాష్టప్రతి, గవర్నర్ల జీతభత్యాలను సవరించటం జరిగిందని గుర్తు చేశారు. తాజా ప్రతిపాదనల ప్రకారం రాష్టప్రతికి నెలకు 5లక్షలు, ఉప రాష్టప్రతికి 4 లక్షలు, గవర్నర్లకు 3.5లక్షల చొప్పున జీతాలు లభిస్తాయని సభ్యుల హర్షధ్వానాల మధ్య జైట్లీ ప్రకటించారు. ప్రస్తుతం రాష్టప్రతికి 1.5లక్షలు, ఉప రాష్టప్రతికి 1.25లక్షలు, గవర్నర్‌కు 1.1 లక్షల జీతం లభిస్తోంది. అయితే ఈ జీతాలు ఉన్నతాధికార్లు, త్రివిధ ధళాల అధినేతలకంటే చాలా తక్కువగా ఉండటం వల్ల ఆ లోపాన్ని సవరిస్తూ తాజా ప్రతిపాదన చేశామన్నారు.