జాతీయ వార్తలు

రక్షణకు మరింత దన్ను

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 1: దేశ రక్షణ వ్యవస్థను మరింత శక్తిమంతంగా తీర్చిదిద్దేందుకు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ 2.95 లక్షల కోట్ల రూపాయలను కేటాయించారు. గత ఏడాది కేటాయించిన 2.74 లక్షల కోట్ల కంటే ఈసారి కేటాయింపులు 7.81 శాతంమేర పెరిగాయి. త్రివిధ దళాలు తమ రక్షణపరమైన అవసరాలను, అలాగే ఆయుధాలను సమకూర్చుకునేందుకు ఈ భారీ కేటాయింపులు వీలుకల్పిస్తాయి. ముఖ్యంగా ఆధునిక ఆయుధాలు, విమానాలు, యుద్ధ నౌకలు, ఇతర సైనిక హార్డ్‌వేర్‌ను కొనుగోలు చేసేందుకు 99,947 కోట్ల రూపాయలను కేటాయించారు. 24,42,213 కోట్ల మొత్తం బడ్జెట్‌లో రక్షణకు 12.10శాతం మేర కేటాయించారు. దేశ సరిహద్దుల్లో ఎదురవుతున్న సవాళ్లను, అలాగే అంతర్గత భద్రతావసరాలను తీర్చడంలో సైనిక దళాలు నిర్వహిస్తున్న పాత్రను జైట్లీ ఈ సందర్భంగా ప్రశంసించారు. రక్షణ పారిశ్రామిక కారిడార్లను అభివృద్ధి చేస్తామని, త్రివిధ దళాల ఆధునీకరణకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. రక్షణ సిబ్బంది పెన్షన్ కోసం విడిగా లక్షా 8వేల కోట్లను ఆర్థిక మంత్రి కేటాయించారు. గత ఏడాదికంటే కూడా ఈసారి పెన్షన్‌ల కోసం 26.60 శాతం మొత్తాన్ని అధికంగా కేటాయించారు. గత మూడేన్నరేళ్లలో సాయుధ దళాల నిర్వహణ సామర్థ్యాన్ని పెంచేందుకు, పెరుగుతున్న సవాళ్లకు ధీటుగా ఆధునీకరించేందుకు అన్ని చర్యలూ తీసుకున్నామన్నారు. రక్షణ రంగంలో ప్రయివేట్ పెట్టుబడులకు మార్గాన్ని సుగమం చేశామని, అలాగే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకూ ఆస్కారాన్ని కల్పిస్తున్నామని జైట్లీ తెలిపారు.