జాతీయ వార్తలు

జమిలి జాబిలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎన్టీయే తాజా బడ్జెట్ ముందస్తు కూత కూసిందా? ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ జమిలి ఎన్నికల జాబిలినే చూపించారు. సంక్షేమానికి పండగ చేశారు. తలా ఇంత అన్నట్టుగా అన్ని రంగాల్నీ ఆదరించారు. ముఖ్యంగా ఆరోగ్యం, విద్య, వ్యవసాయం, గ్రామీణ రంగాలకు పెద్ద పీట వేసి సర్కార్ జనహితాశయాన్ని చాటారు. నొప్పించక తానొవ్వక అన్న రీతిన జైట్లీ నవభారతానికి బలమైన నిధుల పునాదినే వేశారు.
*
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 1: ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం 2018-19 వార్షిక బడ్జెట్ ప్రతిపాదనల్లో రైతుకు పెద్దపీట వేసింది. అంతేకాదు, జనాకర్షణకూ ప్రాధాన్యమిచ్చింది. ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ గురువారం ఉదయం 11 గంటలకు లోక్‌సభలో ఎన్డీయే సర్కారు చివరి పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రతిపాదించారు. ఆయుష్మాన్ భారత్ పథకం కింద పది కోట్ల కుటుంబాలకు వర్తించేలా ఉచిత ఆరోగ్య పథకానికి తెరలేపారు. ఈ పథకం కింద గ్రామీణ ప్రాంతాల్లో 1.5 లక్షల ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటు చేస్తారు. ఆదాయ పన్ను పరిమితి పెంపునకు నిరాకరించిన జైట్లీ, ఉద్యోగస్తుల ప్రయాణ, వైద్య ఖర్చుల నిమిత్తం రూ.40 వేల స్టాండర్డ్ డిడక్షన్ ప్రకటించి వారి మెప్పు పొందేందుకు ప్రయత్నించారు.
బడ్జెట్‌లో వ్యవసాయ రంగం, గ్రామీణాభివృద్ది, వైద్య ఆరోగ్యం, విద్య, ఉపాధి కల్పన, ఎంఎస్‌ఎంఈ, వౌలిక రంగాలకు అధిక ప్రాధాన్యత కనబర్చారు. మొబైల్ ఫోన్లపై కస్టమ్ డూట్యీని 15నుంచి 20 శాతానికి పెంచారు. పరికరాలపై 15శాతం, టీవీ విడి భాగాలపై 15శాతం పన్ను విధించారు. ముడి జీడిపప్పుపై కస్టమ్ డ్యూటీని 5నుంచి 2.5 శాతానికి తగ్గించారు. దిగుమతి వస్తువులపై ఇంతవరకు విధిస్తున్న విద్యా సెస్సు, సెకండరీ, ఉన్నత విద్యా సెస్సును తొలగించి దానిస్థానంలో 10శాతం సామాజిక సంక్షేమ సర్‌చార్జిని విధించారు. వ్యక్తిగత ఆదాయ పన్ను, కార్పొరేట్ పన్నులపై విధిస్తున్న 3శాతం విద్యా సెస్సును నాలుగు శాతానికి పెంచుతూ దీన్ని విద్య, ఆరోగ్య సెస్సుగా ప్రతిపాదించారు. ఈ సెస్సుతో ప్రభుత్వానికి 11వేల కోట్ల ఆదాయం వస్తుందని అంచనా. అరుణ్ జైట్లీ తన బడ్జెట్‌లో వయో వృద్ధులకు కొన్ని రాయితీలు ప్రకటించారు. వయో వృద్ధుల బ్యాంకు డిపాజిట్ల పన్ను మినహాయింపును 10వేల నుంచి యాభై వేలకు పెంచారు. వయో వృద్ధుల ఆరోగ్య బీమాకు సంబంధించి యాభై వేల రూపాయల వరకూ ఆదాయ పన్ను మినహాయింపు తీసుకునేందుకు వీలు కల్పించారు. వయో వృద్ధులకు సంబంధించిన కొన్ని తీవ్ర ఆనారోగ్యాలకు సంబంధించి 80 డిడిబి కింద లక్ష రూపాయలకు పన్ను మినహాయింపు తీసుకునేందుకు బడ్జెట్‌లో వీలు కల్పించారు. ప్రభుత్వం తీసుకున్న ఈ చర్యలతో వయో వృద్ధులకు మొత్తంగా 4 వేల కోట్ల రూపాయల ప్రయోజనం కలుగుతుందని జైట్లీ వివరించారు. వయో వృద్ధులు పన్నుభారం లేకుండా బ్యాంకుల్లో డిపాజిట్ చేసుకునే మొత్తాన్ని ప్రస్తుతమున్న ఏడున్నర లక్షల నుంచి 15 లక్షల రూపాయలకు పెంచారు. ఇదిలావుంటే షేర్లకు సంబంధించి 10శాతం లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ పన్ను విధించారు.
ఆయుష్మాన్ పథకం కింద దేశంలోని పది కోట్ల బీద కుటుంబాలు (దాదాపు యాభై కోట్ల మందికి) సాలీనా ఒక కుటుంబానికి ఐదు లక్షల వైద్య ఖర్చులను కేంద్రం ఈ పథకం కింద భరిస్తుంది. ఈ పథకానికి అయ్యే ఖర్చును భరించేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తుందని జైట్లీ వెల్లడించారు. ఇది ప్రభుత్వం నిధులు అందించే అతి పెద్ద ఆరోగ్య సంరక్షణ కార్యక్రమం అవుతుందని జైట్లీ ప్రకటించారు.
తమ ప్రభుత్వం తీసుకున్న వివిధ చర్యల వలన దేశంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు గణనీయంగా వచ్చాయని జేట్లీ ప్రకటించారు. ఎన్డీయే ప్రభుత్వం అవినీతిపై కొరడా ఝుళిపించటంతో దేశంలో నిజాయితీకి ప్రాధాన్యత పెరిగిందని, యువత నిజాయితీతో జీవించాలని అనుకుంటున్నారని జైట్లీ తెలిపారు. సులభతర వ్యాపార వాతావరణాన్ని కల్పించటంలో విజయం సాధించిన ప్రభుత్వం, ఇకమీదట దేశ ప్రజలకు సులభ జీవిత వాతావరణాన్ని కల్పించేందుకు కృషి చేస్తోందని జేట్లీ ప్రకటించారు.
రైతాంగానికి పెద్ద పీట
ఇంతవరకు కనీస మద్దతు ధర ప్రకటించని ఇతర అన్ని ఖరీప్ పంటలనూ కనీస మద్దతు ధర పరిధిలోకి తేవాలని నిర్ణయించినట్టు జేట్లీ ప్రకటించారు. ఈ పంటలకు ఓకటిన్నరకంటే ఎక్కువ ధర లభించేలా చూసేందుకు నీతి ఆయోగ్, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి ఒక యంత్రాంగాన్ని ఏర్పాటు చేస్తుందన్నారు. గిడ్డంగుల వ్యవస్థను మరింత పటిష్టం చేస్తామన్నారు. ఇప్పుడున్న 22 వేల గ్రామీణ హాట్‌లను గ్రామీణ వ్యవసాయ మార్కెట్లుగా అభివృద్ది చేస్తామన్నారు. రెండు వేల కోట్ల మూల ధనంతో ఆగ్రి-మార్కెట్ వౌలిక నిధి ఏర్పాటు చేస్తామన్నారు. వెయ్యి హెక్టార్లలో ఆర్గానిక్ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తారు. ఈ రంగంలో స్వయం సహాయక బృందాలను ప్రోత్సహించేందుకు ప్రాధాన్యత ఇస్తామన్నారు. ఫుడ్ ప్రాసెసింగ్ శాఖకు రూ.715 కోట్ల నుంచి 1400 కోట్లకు నిధులు పెంచుతున్నామని జైట్లీ ప్రకటించారు. టమోటా, ఉల్లి, ఆలుగడ్డ పంటలతో రైతు, ప్రజలకు ఎదురవుతున్న సమస్యల పరిష్కారానికి ఆపరేషన్ గ్రీన్ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్టు జేట్లీ ప్రకటించారు. ఆపరేషన్ ఫ్లడ్ దారిలో ఆపరేషన్ గ్రీన్ కార్యక్రమాన్ని అమలు చేస్తామన్నారు. వ్యవసాయోత్పత్తుల ఎగుమతికి సంబంధించిన నియమ నిబంధనలను సులభతరం చేసి, నాణ్యత పరిశీలనకు 42 మెగా ఫుడ్ పార్కుల్లో అధునాతన పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేస్తామన్నారు. సౌర విద్యుదుత్పత్తిలో రైతులను ప్రోత్ససించేందుకు పలు చర్యలు తీసుకుంటామన్నారు. మత్స్య పరిశ్రమ అభివృద్ధిలో భాగంగా పిషరీస్, ఆక్వా కల్చర్‌లో వౌలిక సదుపాయాల కల్పన అభివృద్ధి నిధి ఏర్పాటు చేస్తున్నట్టు జైట్లీ ప్రకటించారు. దీంతోపాటు పశుసంవర్దకంలో వౌలిక సదుపాయాల అభివృద్ధి నిధి ఏర్పాటుకు ప్రతిపాదించారు. ఈ రెండింటికీ రూ.10 వేల కోట్లతో ప్రత్యేక నిధి ఏర్పాటు చేస్తున్నట్టు జైట్లీ ప్రతిపాదించారు. రైతులకు బ్యాంకుల ఇచ్చే రుణాలను 11 లక్షలకు పెంచారు. దేశంలోని 8కోట్ల మంది మహిళలకు ఉజ్వల పథకం కింద ఉచిత ఎల్పీజీ కనెక్షన్లు ఇచ్చేందుకు ప్రతిపాదించారు. ఇంతకుముందు ఐదు కోట్ల మంది మహిళలకు ఉచిత ఎల్పీజీ కనెక్షన్లు ఇవ్వటం తెలిసిందే. తమ ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో ఇంతవరకు ఆరు కోట్ల మరుగుదొడ్లు నిర్మించిందని, ఈ ఏడాది మరో రెండు కోట్ల మరుగుదొడ్లు నిర్మిస్తుందని చెప్పుకొచ్చారు. 2018-19లో గ్రామీణ ప్రాంతాల్లో 51 లక్షల ఇళ్ల నిర్మాణం చేపడుతున్నామని, దీనికోసం ప్రత్యేక గృహ నిర్మాణ నిధి ఏర్పాటు చేస్తామని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కల్పన, వౌలిక సదుపాయాల కల్పనకు వివిధ మంత్రిత్వ శాఖలు కలిసి మొత్తం 14 లక్షల 34 వేల కోట్లు ఖర్చు చేస్తాయన్నారు. దీనికి అదనంగా మరో 12 లక్షల కోట్లను ఇతరత్రా ఖర్చు చేస్తామని వెల్లడించారు. విద్య నాణ్యత పెంపునకు టీచర్లకు ప్రత్యేక బిఎడ్ శిక్షణ చేపడుతున్నట్టు జైట్లీ ప్రకటించారు. ప్రభుత్వ పాఠశాలల్లో బ్లాక్ బోర్డుల స్థానే డిజిటల్ బోర్డుల ఏర్పాటుకు ప్రత్యేక కార్యక్రమం చేపడుతున్నామని తెలిపారు. గిరిజనుల కోసం ఎంపిక చేసిన జిల్లాల్లో ఏకలవ్య మాడల్ రెసిడెన్షియల్ పాఠశాలలు ఏర్పాటు చేస్తామన్నారు. దేశంలో అదనంగా 18 ప్లానింగ్, ఆర్కిటెక్చర్ పాఠశాలలు ఏర్పాటు చేస్తారు. వెయ్యిమంది బిటెక్ విద్యార్థులను ఉన్నత విద్య కోసం ప్రధాన మంత్రి పరిశోధనా కార్యక్రమం కింద ఎంపిక చేస్తారు. ముద్ర పథకం కింద 2018-19లో మూడు లక్షల కోట్ల రుణాలు బడుగు బలహీన, పేద ప్రజలకు అందిస్తారు.
*

చిత్రాలు..జైట్లీ , .జైట్లీ బడ్జెట్ ప్రసంగాన్ని రేడియోలో ఆసక్తిగా వింటున్న గ్రామీణులు

*అదిగో వెనె్నలయంటూ
ఇదిగోయని ఊయలూపి ఇంతేనంటూ
మది దోచెడి ఊసులతో
మోదీ జైట్లీల జమిలి బడ్జెట్ ఇదిరా!