జాతీయ వార్తలు

నవభారతానికి పునాది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 1: కేంద్ర ప్రభుత్వం అభివృద్ధికి దోహదం చేసే బడ్జెట్‌నే అందించిందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చేసిన సానుకూల బడ్జెట్ ప్రతిపాదనల వల్ల నవభారత నిర్మాణ ఆలోచనలకు మరింత బలం చేకూరుతుందని తెలిపారు. ఈ బడ్జెట్ ప్రతిపాదనల వల్ల రైతులు, దళితులు, గిరిజన కమ్యూనిటీలు భారీగా లబ్దిపొందుతాయని వెల్లడించారు. అలాగే గ్రామీణ భారతానికి సరికొత్త అవకాశాలు కూడా ఒనగూరుతాయన్నారు. వ్యవసాయం నుంచి వౌలిక సదుపాయాల వరకూ అన్ని రంగాలపైనా ఆర్థిక మంత్రి దృష్టిపెట్టి వాటిని అన్నిరకాలుగా ఆదుకునేందుకు, శక్తివంతం చేసేందుకు నిధులనుకేటాయించారన్నారు. ఇటు రైతులు, అటు సామాన్యులు, మరోపక్క వ్యాపార వేత్తలకు కూడా బడ్జెట్ ఎన్నో ప్రయోజనాలను అందించిందని, అలాగే జీవన ప్రమాణం, నాణ్యతను పెంచేందుకు ఇది దోహదం చేస్తుందని వెల్లడించారు. బ్యాంకులకు శిరోభారంగా మారిన ఎన్పీయే సమస్య తీర్చడానికి ప్రభుత్వం త్వరలోనే తగిన చర్యలు చేపడుతుందని తెలిపారు. అలాగే సూక్ష్మ, చిన్న, మధ్యవ్యాపార సంస్థలకు కూడా మేలుచేసే చర్యలను చేపడతారన్నారు.

చిత్రం..లోక్‌సభలో ఆర్థికమంత్రి చదువుతున్న బడ్జెట్ ప్రసంగాన్ని ఆసక్తిగా వింటున్న ప్రధాని మోదీ