జాతీయ వార్తలు

రైల్వే కూత ఘనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 1: భారతీయ రైల్వేలకు మరింత ఆర్థిక దన్నును కల్పించే చర్యలను ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తన తాజా బడ్జెట్‌లో చేపట్టారు. దాదాపు 1.48 లక్షల కోట్ల రూపాయలను రైల్వేలకు మూలధన ఖర్చుగా కేటాయిస్తున్నట్టు ప్రకటించారు. ఇప్పటి వరకూ రైల్వేలకు ఇంత భారీగా కేటాయింపులు జరగడం ఇదే మొదటిసారి. గత ఏడాది కేటాయింపుల కంటే కూడా ఈ ఏడాది కేటాయింపులు 13 శాతం ఎక్కువ. తగ్గిపోతున్న రైల్వే రెవిన్యూను గాడిలో పెట్టేందుకు, అదేవిధంగా రైల్వేల సామర్థ్యాన్ని పూర్తిస్థాయిలో వినియోగించుకోవడానికి ఆర్థిక మంత్రి పలు చర్యలను ప్రతిపాదించారు. 2018-19 వార్షిక బడ్జెట్‌ను గురువారం లోక్‌సభలో ప్రవేశపెట్టిన జైట్లీ ‘1,48,528 కోట్ల రూపాయలను రైల్వేలకు కేటాయిస్తున్నాం. దేశవ్యాప్తంగా రైల్వే నెట్‌వర్క్‌ను మరింత శక్తివంతం చేయడమే లక్ష్యం. అలాగే రైల్వేల సామర్థ్యాన్ని కూడా పెంపొందించేందుకు అనేక చర్యలు తీసుకుంటాం’ అని స్పష్టం చేశారు. రాష్ట్రీయ రైల్ సంరక్షా కోష్ కింద భద్రతకే ప్రాధాన్యం అన్న విధానంతో కేటాయింపులు జరిపామని వెల్లడించారు. అలాగే ముంబయి, బెంగళూరు సబర్బన్ ప్రయాణికులకు కూడా అనేక రాయితీలు అందించారు. దేశంలో 600 ప్రధాన రైల్వే స్టేషన్లను ఆధునీకరిస్తామని, ఈ బాధ్యతను భారత రైల్వే స్టేషన్ అభివృద్ధి కంపెనీకి అప్పగించామన్నారు. 25వేలకుపైగా ప్రయాణికుల ఉండే ప్రతి స్టేషన్‌కూ ఎస్కలేటర్ సౌకర్యం కల్పిస్తామన్నారు. అలాగే అన్ని రైల్వే స్టేషన్లు, రైళ్లలో క్రమానుగతంలో వైఫై సౌకర్యం కల్పిస్తామని తెలిపారు. అలాగే, అన్ని రైల్వే స్టేషన్లలో ప్రయాణికుల భద్రత పెంపొందించేందుకు సీసీ టీవీ కెమెరాలు ఏర్పాటు చేస్తామన్నారు. అయితే, ఈ తాజా బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి ఎలాంటి కొత్త రైళ్లను ప్రకటించలేదు. ఉన్న రైల్వే వ్యవస్థను ఆధునీకరించటం, ప్రయాణికుల భద్రతను పెంపొందించటమే లక్ష్యంగా
బడ్జెట్ కేటాయింపులు సాగాయి. గత 92 సంవత్సరాలుగా విడిగా రైల్వేలకు బడ్జెట్ ప్రతిపాదించే సంప్రదాయానికి గత ఏడాదే తెరదించిన ఎన్డీయే ప్రభుత్వం, సాధారణ బడ్జెట్‌లో భాగంగానే రైల్వే కేటాయింపులనూ ప్రతిపాదిస్తూ వస్తోంది. తాజాగా జరిగిన కేటాయింపుల్లో ప్రధాన భాగాన్ని సామర్థ్య సృజనకు వినియోగిస్తామని ఆర్థిక మంత్రి తెలిపారు. 18వేల కిలోమీటర్లమేర డబ్లింగ్ పనులు, అలాగే 3వ, 4వ లైన్ పనులు, ఐదువేల కిలోమీటర్ల గేజ్ మార్పిడివంటి కార్యకలాపాలకు కేటాయించిన నిధుల్లో ప్రధాన మొత్తాన్ని వినియోగిస్తామని జైట్లీ తెలిపారు. ఈ పనులు పూర్తయితే రైల్వే సామర్థ్యం మరింత పెరుగుతుందని, మొత్తం రైల్వే నెట్‌వర్క్‌ను బ్రాడ్‌గేజ్‌గా మార్చేందుకు వీలుంటుందని తెలిపారు. రైల్వే ట్రాక్ నిర్మాణ, నిర్వహణకు సంబంధించి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని, దాదాపు 3,600 కిలోమీటర్ల మేర రైల్వే లైన్లను ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పునరుద్ధరించటమే లక్ష్యంగా పని చేస్తున్నామని జైట్లీ తెలిపారు. రైల్వే ప్రయాణాలను సురక్షితంగా మార్చేందుకు, ప్రయాణికుల భద్రతకు మరింత ప్రాధాన్యత ఇచ్చేందుకు ‘్ఫగ్ సేఫ్, రైళ్ల పరిరక్షణ, హెచ్చరికల వ్యవస్థ’లను పటిష్టం చేస్తున్నామని, ఇందుకోసం ఆధునిక టెక్నాలజీని వినియోగిస్తామని తెలిపారు. రానున్న రెండేళ్లకాలంలో 4267 ఎలాంటి కపలాలేని లెవెల్ క్రాసింగ్‌లను తొలగిస్తామన్నారు. అలాగే ఆధునిక సౌకర్యాలతో కూడిన ట్రెయిన్ సెట్లను కూడా ఈ సందర్భంగా జైట్లీ ప్రకటించారు. ఇందుకు సంబంధించిన అంశాలను పెరంబదూర్‌లోని ఇంటిగ్రేటెడ్ కోచ్ ప్యాక్టరీ చేపడుతుందన్నారు. తొలి ట్రెయిన్ సెట్‌ను 2018-19లోనే ప్రారంభిస్తామన్నారు. కొత్త ఆర్థిక సంవత్సరంలో 12వేల వ్యాగన్లు, 5160 కోచ్‌లు సమకూర్చుకుంటామని తెలిపారు. అలాగే మొట్టమొదటిసారిగా నిత్యం రద్దీగావుండే ముంబయి రవాణా వ్యవస్థను విస్తరిస్తామని, మరో 90 కిలోమీటర్లమేర 11వేల కోట్ల ఖర్చుతో డబుల్‌లైన్ ట్రాక్‌లు ఏర్పాటు చేస్తామన్నారు. అలాగే 40వేల కోట్లతో ముంబయి నగరానికి సబర్బన్ నెట్ వర్క్ సమకూరుస్తామన్నారు. బెంగళూరు మెట్రోపాలిస్ అభివృద్ధికి 17వేల కోట్ల రూపాయలను కేటాయిస్తున్నామని, ఇందులో భాగంగా 160 కిలోమీటర్ల సబర్బన్ నెట్‌వర్క్ పనులు పూర్తి చేస్తామన్నారు.