జాతీయ వార్తలు

పలాయనవాద బడ్జెట్ ఇది..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 1: ‘ఇది ప్రజల ఆశలను నీరుగార్చింది. కేవలం మాటల గారడీయే తప్ప వాస్తవ ప్రయోజనం లేదు’ అంటూ ఎన్డీఏ ప్రభుత్వ బడ్జెట్‌పై ప్రతిపక్షాలు నిప్పులు చెరిగాయి. ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఆర్థికమంత్రి జైట్లీ విస్మరించారని, ప్రజలకు ఇచ్చిన ఏ హామీని నిలబెట్టుకోలేకపోయారని విపక్షాలు ధ్వజమెత్తాయి. ‘హమ్మ య్య. మోదీ సర్కార్‌కు ఇక ఒక్క ఏడాదే మిగిలింది’ అంటూ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ వ్యంగోక్తి విసిరారు. రైతులు, యువతకు సంబంధించిన అంశాలపై ప్రభుత్వం న్యాయం చేయలేకపోయిందని, కేంద్రంలో ఎన్డీఏ అధికారంలోకి వచ్చి నాలుగేళ్లయినా రైతులకు గిట్టుబాటు ధర అన్నది అందుబాటులోకే రాలేదని, కేవలం ఆకర్షణీయ పథకాలతోనే ప్రభుత్వం కాలం గడుపుతోందని రాహుల్ అన్నారు. ఇప్పటివరకు యువతకు ఉపాధి కల్పించిన దాఖలాలే లేవని, ప్రకటించిన పథకాలకు నిధులే కరువయ్యాయని అన్నారు. బడ్జెట్ పూర్తిగా నిరాశ పరిచిందని మాజీ ఆర్థిక మంత్రి కాంగ్రెస్ నాయకుడు చిదంబరం అన్నారు. ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన ఏ అంశాన్నీ ప్రభుత్వం పరిష్కరించలేకపోయిందని తెలిపారు. ఈ బడ్జెట్ మరింత సాహసోపేతంగా విప్లవాత్మకంగా ఉండి ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు. ఏవిధంగా చూసినా ఇది పలాయనవాద బడ్జెట్ అని ఏ రకమైన కొత్త ఆలోచనలను వెలుగులోకి తేలేకపోయిందని చిదంబరం తెలిపారు. అంతా మాటల గారడీ తప్ప పథకాల్లో పస లేదన్నారు. గత మూడేళ్ల కాలంలో ఏమీ చేయలేకపోయిన ప్రభుత్వం తీసుకొచ్చిన బడ్జెట్‌గా జైట్లీ బడ్జెట్‌ను ఆయన అభివర్ణించారు. పదికోట్ల పేద కుటుంబాలకు వార్షికంగా ఐదులక్షల రూపాయల ఆరోగ్య బీమాను కల్పిస్తామన్న ప్రతిపాదన ఓ పెద్ద జిమ్మిక్కు అని పేర్కొన్నారు. విత్త స్థిరీకరణ పరీక్షలో జైట్లీ విఫలమయ్యారని, ఆయన వైఫల్యం తీవ్ర స్థాయి పర్యవసానాలకే దారితీస్తుందని హెచ్చరించారు. వచ్చే ఏడాది జరగనున్న లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే ఎన్డీఏ సర్కార్ ఈ బడ్జెట్ రూపొందించిందని సీపీఎం నాయకుడు మహ్మద్ సలీం అన్నారు. ముందస్తు ఎన్నికలు జరిగే అవకాశం ఉందన్న ఊహాగానాల నేపథ్యంలో ఓట్లపై బిజెపి సర్కార్ దృష్టి పెట్టిందని, ఈ బడ్జెట్ సూపర్ ఫ్లాప్ అనీ, ఒక రకంగా ఇది ప్రభుత్వ మరణ వాంగ్మూలమనీ తృణమూల్ కాంగ్రెస్ అభివర్ణించింది. ప్రజల కళ్లుగప్పేందుకు నిస్సహాయ ప్రయత్నంగా తాజా బడ్జెట్‌ను సీపీఐ నాయకుడు డి.రాజా అభివర్ణించారు. ఇది ఏవిధంగానూ వృద్ధికి దోహదం చేసేది కాదనీ, ఉపాధి అవకాశాలను మెరుగుపరిచేందుకు ఎలాంటి ఆలోచన చేయలేదన్నారు.

చిత్రం..పార్లమెంట్ ఆవరణలో మీడియాతో మాట్లాడుతున్న రాహుల్‌గాంధీ