జాతీయ వార్తలు

బడ్జెట్ హైలైట్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* వ్యక్తిగత ఆదాయపన్ను స్లాబుల్లో ఎలాంటి మార్పు లేదు.
* 50 లక్షల నుండి కోటి రూపాయిల వరకూ ఆదాయం ఉన్న వారికి 10 శాతం, కోటికి మించి ఆదాయం ఉన్న వారికి 15 శాతం మేర సర్‌చార్జి విధిస్తారు.
* రవాణా, మెడికల్ ఖర్చులపై 40వేలు తిరిగి పొందవచ్చు.
* ఆర్ధికాభివృద్ధి రేటును 7.2 శాతం నుండి 7.5 శాతానికి పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
* గత మూడేళ్లలో సగటు అభివృద్ధి రేటు 7.5 శాతం
* భారత ఆర్ధికవ్యవస్థ మొత్తం 2లక్షల 50వేల కోట్లు డాలర్లు , ప్రపంచంలోనే ఏడో పెద్ద ఆర్థిక వ్యవస్థ
* తొందర్లోనే ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా రూపాంతరం చెందనుంది.
* ద్రవ్యలోటు 2017-18 సంవత్సరానికి 5.95 లక్షల కోట్లు ఇది జిడిపిలో 3.5 శాతం.
* 2018-19 ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యలోటు జీడీపీలో 3.3 శాతం
* వైద్య, విద్య సెస్సు 4 శాతం పెంపు
* వయోధిక పౌరుల ఎఫ్‌డీ, పోస్ట్ఫాసు డిపాజిట్లపై టిడిపిఎస్ ఉండదు, 50వేల వరకూ వర్తింపు
* సీనియర్ సిటిజన్ల వైద్య ఖర్చులకు అదనపు రాయితీ 60వేల నుండి లక్షకు పెంపు
* వయోధిక పౌరుల బ్యాంకు డిపాజిట్ల ఆదాయం పన్ను పరిమితి పెంపు 50వేల వరకూ వర్తింపు.
* 2018-19 బడ్జెట్ అంచనా 21.57 లక్షల కోట్లు. ద్రవ్యలోటు 3.3 శాతం
* వేతన ఉద్యోగులకు 40వేల వరకూ ప్రయాణ, వైద్య ఖర్చులకు స్థిర తగ్గింపు వర్తింపు.
* చిన్నతరహా పాదరక్షలు, తోలు ఉత్పత్తుల తయారీ సంస్థల లాభాలపై ఆదాయ పన్ను రాయితీ
* సైనిక సంపత్తి, ఆయుధాల తయారీలో స్వాలవంభనకు ప్రయత్నం, ఆయుధాల తయారీ రంగంలో విదేశీ పెట్టుబడులకు ప్రోత్సాహం
* అమృత్ పథకం కింద 19,428 కోట్లుతో 494 ప్రాజెక్టులు
* ప్రత్యక్ష పన్నుల్లో 12.6 శాతం వృద్థి, గత రెండేళ్లుగా ఆదాయ పన్ను వసూళ్లలో భారీ పెరుగుదల
* దేశంలో పన్ను చెల్లింపుదారుల సంఖ్య 85.51 కోట్లు. 40 శాతానికి పెరిగిన పన్ను రిటర్నులు దాఖలు చేసే వారి సంఖ్య
* వ్యక్తిగత ఆదాయ పన్ను చెల్లింపులు కింద అదనంగా 90 వేల కోట్ల సేకరణ
* ద్రవ్యోల్బణం ఆధారంగా ఐదేళ్లకోమారు ఎంపీల వేతనాల్లో మార్పు
* ప్రతి వ్యాపార సంస్థకు యూనిక్ ఐడీ
* స్టాంప్ డ్యూటీ విధానం నుండి బయటపడేందుకు రాష్ట్రాలతో సంప్రదింపులు
* పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యం 80వేల కోట్లు
* కృత్రిమ మేధో రంగంలో పరిశోధనలు
* క్రిప్టో కరెన్సీపై నిషేధం
* భారత్ నెట్‌వర్క్ కార్యక్రమంకోసం 10వేల కోట్లు
* 900 కొత్త విమానాల కొనుగోలు, వంద కోట్లతో విమానాశ్రయాల విస్తరణ
* టోల్ ప్లాజాల్లో సులభతర ప్రయాణానికి వీలుగా ఎలక్ట్రానిక్ చెల్లింపులు
* 2020 నాటికి 50 లక్షల మంది యువతకు శిక్షణ
* ఉడాన్ పథకం కింద 56 విమానాశ్రయాల అభివృద్ధి
* జీవన ప్రమాణాల మెరుగుదలకు పైలట్ ప్రాజెక్టు కింద 115 జిల్లాల ఎంపిక
* 3600 కిలోమీటర్ల మేర రైల్వేలైన్ పునరుద్ధరణ
* రవాణా రంగం కారిడార్ నిర్మాణంపై ప్రత్యేక శ్రద్ధ
* రైల్వేల్లో 18వేల కిలోమీటర్ల డబ్లింగ్, రైలు పట్టాల నిర్వాహణకు పెద్దపీట, 4వేలకు పైగా కాపలాదారులు లేని గేట్ల తొలగింపు
* ఇంటింటి తాగునీటి పథకానికి 77,500 కోట్లు
* రోడ్లు వౌలిక వసతులకు 9.64 లక్షల కోట్లు
* రైల్వేలకు 1.48 లక్షల కోట్లు
* ఆకర్షణీయ నగరాల పథకం కింద 99 నగరాల ఎంపిక, వాటి అభివృద్ధికి 2.04 లక్షల కోట్లు
* నమామి గంగ పథకం కింద 187 ప్రాజెక్టులు, 10 పర్యాటక ప్రాంతాల అభివృద్ధి, పురావస్తు శాఖ కింద ఉన్న 110 కేంద్రాల అభివృద్ధి
* సరిహద్దుల్లో వౌలిక సౌకర్యాలకు ప్రాధాన్యత
* వస్త్ర పరిశ్రమకోసం, ప్రత్యేక ప్రోత్సాహకాలు, టెక్స్‌టైల్ రంగానికి 7140కోట్లు
* పీఎం జీవన్ బీమా యోజన ద్వారా రెండు కోట్ల కుటుంబాలకు లబ్ది
* దళిత సంక్షేమానికి 56వేల కోట్లు. ఆదివాసీల సంక్షేమానికి 32,508 కోట్లు
* చిన్న, సూక్ష్మ తరహా పరిశ్రమలకు 3790 కోట్లు
* ఆరోగ్య రంగానికి 1.38 లక్షల కోట్లు
* గ్రామీణ పారిశుద్ధ్య పథకానికి 16,713 కోట్లు
* ప్రధాని సౌభాగ్య పథకంలో భాగంగా నాలుగు కోట్ల గృహాలకు ఉచిత విద్యుత్ కనెక్షన్లు, ఇందుకు 16వేల కోట్ల కేటాయింపు
* మహిళా స్వయం సహాయక బృందాలకు 75 వేల కోట్లు
* క్షయ రోగుల సంక్షేమానికి 600 కోట్లు
* 330 రూపాయిల ప్రీమియంతో 10 కోట్ల పేద కుటుంబాలకు 5 లక్షల వరకూ ఆరోగ్య బీమా
* విద్యారంగంలో వౌలిక సౌకర్యాలకు లక్ష కోట్లు
* 2017 జాతీయ ఆరోగ్య పథకంలో భాగంగా ఆయుష్మాన్ భారత్ , ఆరోగ్య కేంద్రాలకు 1200 కోట్లు
* ఆదివాసీ బాలలకు ఏకలవ్య పాఠశాలలు, వడోదరలో రైల్వే విశ్వవిద్యాలయం
* బ్లాక్ బోర్డు నుండి డిజిటల్ బోర్డు, డిజిటల్ విద్యా కేంద్రాలు
* వ్యవసాయ రుణాలకు 11 లక్షల కోట్లు
* జాతీయ జీవనోపాధి కార్యక్రమానికి 5750 కోట్లు
* గృహ నిర్మాణానికి ప్రత్యేక నిధి
* ప్రధాన మంత్రి సడక్ గ్రామయోజన ద్వారా గ్రామీణ రోడ్ల అనుసంథానం
* ఉజ్వల యోజనలో భాగంగా 8 కోట్ల మంది గ్రామీణ మహిళలకు గ్యాస్ కనెక్షన్లు
* మత్స్య శాఖ, పశుసంవర్ధక శాఖలకు 10వేల కోట్లు. జాతీయ వెదురు పరిశ్రమలకు 1290 కోట్లు కేటాయింపు
* చేపలు, పశు పెంపకందారులకూ కిసాన్ క్రెడిట్ కార్డులు
* 42 మెగాఫుడ్ పార్కుల అభివృద్ధి, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు 1400 కోట్లు
* ఆపరేషన్ గ్రీన్‌కోసం 500 కోట్లు
* సుగంధ మొక్కలు, నూనెల అభివృద్ధికి 200కోట్లు
* గ్రామీణ వ్యవసాయ మార్కెట్‌లకు 2వేల కోట్లు
* వ్యవసాయం, ఉద్యానవన రంగాలకు ప్రాధాన్యత
* 2022 నాటికి రైతు ఆదాయం రెండింతలు పెంచే కార్యక్రమాలు.