జాతీయ వార్తలు

బోఫోర్స్‌పై దర్యాప్తుకు అనుమతించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 3: బోఫోర్స్ ముడుపుల కేసును మళ్లీ దర్యాప్తు చేయడానికి అనుమతించాలని కోరుతూ కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) ఢిల్లీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ కేసుకు సంబంధించి తాజా పత్రాలు, ఆధారాలు తనకు లభ్యం అయ్యాయని కోర్టుకు విన్నవించింది. ఢిల్లీలోని చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ అశు గార్గ్ ముందు సీబీఐ గురువారం ఈ పిటిషన్ సమర్పించింది. రూ. 64 కోట్ల ముడుపుల బోఫోర్స్ కుంభకోణం కేసులో నిందితులందరినీ నిర్దోషులుగా ప్రకటిస్తూ ఢిల్లీ హైకోర్టు 2005 మే 31న ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ సీబీఐ శుక్రవారం సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ (ఎస్‌ఎల్‌పీ)ను దాఖలు చేసిన విషయం విదితమే. అయితే, అంతకన్నా ఒక రోజు ముందు గురువారమే సీబీఐ బోఫోర్స్ కుంభకోణం కేసును మళ్లీ దర్యాప్తు చేయడానికి అనుమతించాలని కోరుతూ ఈ కేసును తొలుత విచారించిన చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టును ఆశ్రయించింది. సీబీఐ ఈ విషయాన్ని సుప్రీంకోర్టులో దాఖలు చేసిన ఎస్‌ఎల్‌పీలో వెల్లడించింది.