జాతీయ వార్తలు

ఇంకా ఆలోచించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై, ఫిబ్రవరి 8: తమిళనాడులో వచ్చే ఎన్నికల్లో కలసి పనిచేసే విషయమై తాను, రజనీకాంత్ కలసి ఆలోచించాల్సి ఉందని ప్రముఖ నటుడు కమల్‌హాసన్ అన్నారు. కొత్తగా పార్టీని స్థాపించి రాజకీయాల్లోకి ప్రవేశించేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్న కమల్ ఈ మేరకు తన ఆలోచనలను ఓ వ్యాసంలో వెల్లడించారు. వచ్చే ఎన్నికల్లో ఉమ్మడిగా పోటీచేస్తారా అని తమను పదేపదే ప్రశ్నిస్తున్నారని, సమయమే దీనికి సమాధానం చెబుతుందని రజనీకాంత్ చెప్పారని, ఈ విషయంలో ఆయన అభిప్రాయానే్న తాను కూడా బలపరుస్తున్నానని చెప్పారు. ప్రముఖ తమిళ పత్రిక ‘ఆనంద వికటన్’లో వారంవారం రాసే శీర్షికలో కమల్ ఈ విషయాలను పేర్కొన్నారు. తమిళనాటలో తన కొత్త రాజకీయ పార్టీ పేరు ప్రకటించి ఈనెల 21 నుంచి రాష్ట్రంలో పర్యటించేందుకు కమల్‌హాసన్ అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. మొదటు తాను, రజనీకాంత్ తమతమ పార్టీలను లాంఛనంగా ప్రారంభించాల్సి ఉందని, పార్టీల విధవిధానాలు వెల్లడించాల్సి ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. రెండు పార్టీల ఆలోచనల్లో సారూప్యత ఉందాలేదా చూడాల్సి ఉందని, అయినా కలసి పనిచేయాలన్న విషయంపై నిర్ణయం ఇప్పుడే తీసుకోలేమని, ఇద్దరమూ కలసి ఆలోచించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఈ విషయం సినిమాల్లో తారలను ఎంపిక చేసినంత తేలిక కాదని, ఈ రెండూ పూర్తి భిన్నమైన వ్యవహారాలని అన్నారు. గత జనవరి 17న రజనీకాంత్ ఓ ప్రశ్నకు స్పందిస్తూ కమల్‌హాసన్‌తో పొత్తు కుదుర్చుకునే విషయాన్ని కాలమే నిర్ణయిస్తుందని, భవిష్యత్‌లో ఏం జరుగుతుందో చూద్దామని వ్యాఖ్యానించారు. జయలలిత మరణం, వయోభారంతో డీఎంకే అధినేత కరుణానిధి క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉండటంతో తమిళనాడులో ఏర్పడిన రాజకీయ శూన్యత నేపథ్యంలో పరిస్థితులను అనుకూలంగా మార్చుకునేందుకు రజనీ, కమల్ రాజకీయ ప్రవేశంపై ప్రకటనలు చేసి రంగం సిద్ధం చేసుకున్నారు. రాష్ట్ర, దేశ సాధికారత సాధన విషయంలో తనకు సహకరించాలని కమల్ ప్రజలను కోరారు.