జాతీయ వార్తలు

ఎల్‌ఓసి వద్ద తెగబడ్డ పాక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జమ్మూ, ఫిబ్రవరి 10: జమ్మూకాశ్మీర్‌లోని పూంచ్ జిల్లా నియంత్రణ రేఖ (ఎల్‌ఓసీ) వద్ద జనావాసాలను లక్ష్యంగా చేసుకుని పాక్ సైనికులు మోర్టర్‌షెల్ (్ఫరంగి గుళ్ల)తో దాడులకు తెగబడ్డారు. అయితే ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని పోలీసులు వెల్లడించారు. ‘పూంచ్‌లోని ఖాదీ కర్మారా ప్రాంతంలో ఉదయం 11 గంటల సమయంలో ఫిరంగి దాడులకు దిగినట్టు వారు తెలిపారు. అవి ఇళ్లవైపు దూసుకురావడంతో జనం భీతిల్లినట్టు అధికారులు చెప్పారు. అలాగే ఛంకన్ ద బాగ్ ప్రాంతంలోనూ పాక్ ఇలాంటి దుశ్చర్యకే పాల్పడినట్టు పేర్కొన్నారు. పూంచ్ జిల్లాలోనే ఎల్‌ఓసీ వద్ద శుక్రవారం పాక్ దళాలు జరిపిన కాల్పుల్లో ముగ్గురు భారత జవాన్లు గాయపడ్డారు. కేజీ సెక్టార్‌లో ఈ నెల 8న పాక్ కాల్పుల్లో 45 ఏళ్ల మహిళ మృతి చెందిందని అధికారులు చెప్పారు. ఈ రెండు నెలల కాలంలో అంతర్జాతీయ సరిహద్దు, ఎల్‌ఓసీ వద్ద పాక్ దళాల కాల్పుల్లో పది మంది సైనికులతోపాటు 8 మంది పౌరులు మృతి చెందారని రక్షణశాఖ ప్రతినిధి వెల్లడించారు. పాక్ తుటాలకు 75 మంది గాయపడ్డారని అన్నారు.