జాతీయ వార్తలు

సైనికుడు తలొంచడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అహ్మదాబాద్, ఫిబ్రవరి 10: ఆర్మీ, ఇతర భద్రతా బలగాలు సమర్థవంతమైన పనితీరునే ప్రదర్శిస్తున్నాయని హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ కితాబిచ్చారు. కాశ్మీర్‌లో చోటుచేసుకున్న ఉగ్రదాడిపై ఇది మాట్లాడే సమయం కాదని, అక్కడ ఇంకా ఆపరేషన్ కొనసాగుతోందని అన్నారు. కాశ్మీర్‌లోని సంజవాన్ ఆర్మీ క్యాంపుపై తెగబడిన ముష్కరులు ఇద్దరు జవాన్ల ప్రాణాలు పొట్టనుపెట్టుకోవడం తెలిసిందే. ‘నాకు అందిన సమచారం మేరకు అక్కడ ఇంకా ఆపరేషన్ కొనసాగుతోంది. ఆపరేషన్ పూర్తికాకుండా అక్కడి పరిస్థితిపై వ్యాఖ్యలు చేయడం ఎంతమాత్రం మంచిది కాదు’ అని రాజ్‌నాథ్ మీడియాకు వెల్లడించారు. ఆ విషయం పక్కనపెడితే, భారత ఆర్మీ, ఇతర భద్రతా బలగాలు తమ విధి నిర్వహణకు సమర్థవంతంగా నిర్వర్తిస్తున్నాయని రాజ్‌నాథ్ అన్నారు. ‘కర్తవ్య నిర్వహణలో ఏ భారతీయ సైనికుడూ తన తల వంచడు’ అని కితాబిచ్చారు. ఉగ్రదాడిలో జరిగిన నష్టంపై మాట్లాడుతూ ‘ఆ సంఘటన దురదృష్టకరం’ అని వ్యాఖ్యానించారు. అంతకుముందు రాజ్‌నాథ్ కాశ్మీర్ డీజీపీ ఎస్‌పి వేద్‌తో ఫోన్‌లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. అంతకుముందు ఘటనపై అత్యవసరంగా సమావేశమైన సభలో అసెంబ్లీ వ్యవహారాల మంత్రి అబ్దుల్ రెహమాన్ ప్రకటన చేస్తూ, ఉగ్రవాద దాడిలో సుబేదార్ మదన్‌లాల్ చౌదరి, సుబేదార్ మహ్మద్ అషఫ్ మీర్‌లు నేలకొరిగారని ప్రకటించారు.

చిత్రం..గుజరాత్ యూనివర్సిటీలో ఆలిండియా ఫోరెన్సిక్ సైన్స్ కాన్ఫరెన్స్‌ను ప్రారంభించేందుకు శనివారం అహ్మదాబాద్ వచ్చిన రాజ్‌నాథ్ సింగ్