జాతీయ వార్తలు

డిసెంబర్‌కల్లా పూర్తిచేస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 15: ప్రధాన మంత్రి కృషి సించాయి యోజన (పీఎంకేఎస్‌వై) కింద ఎంపిక చేసిన ఎనిమిది ప్రాజెక్టులను 2018 డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు దేవినేని ఉమామహేశ్వరరావు వెల్లడించారు. పీఎంకేఎస్‌వై కింద ఏపీలో నిర్మిస్తున్న ప్రాజెక్టుల పెండింగ్ నిధులను వెంటనే మంజూరు చేయాలని కేంద్రానికి ఉమామహేశ్వరరావు విజ్ఞప్తి చేశారు. పీఎంకేఎస్‌వై కింద కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా 99 సాగునీటి ప్రాజెక్టులు, క్యాడ్‌కామ్ పథకాలపైన గురువారం కేంద్ర జల వనరుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అధ్యక్షతన రాష్ట్రాల నీటి పారుదల శాఖ మంత్రులతో సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న ఉమామహేశ్వరరావు అనంతరం విలేఖరులతో మాట్లాడారు. పీఎంకేఎస్‌వై కింద దశాబ్దకాలం క్రితం ఏపీలో 8 సాగునీటి ప్రాజెక్టులకు రూ.1800 కోట్లతో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించినట్టు చెప్పారు. ఈ ప్రాజెక్టులకు కేంద్రం నుండి రూ.498 కోట్ల నిధులు వచ్చాయని, మిగిలిన నిధులు రూ.1098 కోట్లు విడుదల చేయాలని కేంద్ర మంత్రిని కోరినట్టు ఆయన చెప్పారు.

చిత్రం..కేంద్రమంత్రి గడ్కరీతో మంత్రి ఉమ