జాతీయ వార్తలు

‘ఆయుష్మాన్’తో ఆరోగ్య భారతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇటానగర్, ఫిబ్రవరి 15: దేశంలో 50 కోట్ల మంది ప్రజలకు ప్రయోజనం కలిగించే ‘ఆయుష్మాన్ భారత్ యోజన’ పథకాన్ని ఉద్యమ తరహాలో అమలు చేస్తామని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. ఈ పథకం వల్ల నాణ్యమైన, చౌకగా వైద్యసేవలు అందుబాటులోకి వస్తాయని, ఆరోగ్యరంగంలో సమూల మార్పులకు ఇది నాంది పలుకుతుందని ఆయన చెప్పారు. ప్రభుత్వ నిధులతో నిర్వహించే పథకాల్లో ‘ఆయుష్మాన్’ ప్రపంచంలోనే అతి పెద్దదిగా నిలవబోతోందని ఆయన అన్నారు. ఎన్నికలు జరుగుతున్న ఈశాన్య రాష్ట్రాల్లో సుడిగాలి పర్యటనలు జరుపుతున్న ప్రధాని మోదీ ఒకవైపు ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ మరోవైపు విపక్ష కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పిస్తున్నారు.
అరుణాచల్ ప్రదేశ్ రాజధాని ఇటానగర్‌లో టోమో రిబా ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ మెడికల్ సైనె్సస్‌కు గురువారం శంకుస్థాపన చేసిన అనంతరం ఇందిరాగాంధీ పార్క్ ప్రాంతంలో జరిగిన ర్యాలీలో ప్రధాని మోదీ ప్రసంగించారు. కొత్తగా ప్రారంభిస్తున్న ఈ పథకాన్ని అసమాన రీతిలో, విస్తృత స్థాయిలో అమలుపరచడం ద్వారా దేశంలోని ఆరోగ్యరంగంలో మేలుమలుపు సాధ్యమవుతుందని చెప్పారు. ప్రతి కుటుంబానికి రూ. 5 లక్షల రూపాయల మేరకు ఈ పథకాన్ని వర్తించేలా రూపొందించామని, దీనిద్వారా చౌకగా, నాణ్యమైన వైద్యం అందుతుందని మోదీ చెప్పారు. సరికొత్త ఆరోగ్య విధానాన్ని ప్రకటించి, ప్రైవేటు పెట్టుబడులను ఆకర్షించేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్రప్రభుత్వాన్ని ప్రధాని కోరారు. మార్పులు తీసుకురాబోతున్నామని ఆయన స్పష్టం చేశారు. పార్లమెంటులో 2018-19 బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా ‘ఆయుష్మాన్ భారత్ యోజన’ పథకాన్ని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించారు. గిరిజన సంప్రదాయ సాంస్కృతిక కార్యక్రమంలో పాల్గొన్న మోదీ మాట్లాడుతూ న్యూఢిల్లీ-నహర్లగామ్ ఎక్స్‌ప్రెస్ పేరును ‘అరుణాచల్ ఎక్స్‌ప్రెస్’గా మార్చామని, వారానికి ఒక రోజు నడిచే ఈ రైలును ఇప్పుడు వారానికి రెండు రోజులు నడపనున్నారని ప్రకటించారు. దేశంలోని గుండెకాయలాంటి రాజధానికి ఈ రైలువల్ల అరుణాచల్ ప్రజల అనుసంధానత మరింత బలోపేతమవుతుందని ఆయన చెప్పారు. కాగా అవినీతి నిర్మూలించే దిశగా తమ ప్రభుత్వం పోరాటం కొనసాగిస్తోందని, అందులో భాగంగానే నేరుగా బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేసే పథకం అమలు చేస్తున్నామని మోదీ చెప్పారు. ఆధార్ అనుసంధానం ద్వారా లబ్దిదారుల ఖాతాల్లోకి నేరుగా నగదు జమచేయడం వల్ల 400 పథకాల్లో 54వేల కోట్ల రూపాయలు దుర్వినియోగం కాకుండా చేయగలిగామని చెప్పారు. ఈ సందర్భంగా మోదీ రాష్ట్ర సివిల్ సెక్రటేరియట్‌ను జాతికి అంకితం చేశారు. అనంతరం దోర్జీ ఖండూ రాష్ట్ర కనె్వన్షన్ సెంటర్ నిర్మాణానికి సంబంధించి శిలాఫలకాన్ని ఆవిష్కరించి ఎన్నికలు జరుగుతున్న త్రిపురలో పర్యటనకు బయలుదేరి వెళ్లారు.
కాంగ్రెస్‌పై విమర్శల దాడి
అరుణాచల్‌లో ఒకరోజు పర్యటనలో పాల్గొన్న మోదీ కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ హయాంలో పేదలకు ఉద్దేశించిన పథకాల్లో నిధులు దుర్వినియోగమయ్యాయని, దేశంలో నిధులకు కరవు లేదని, అయితే చిల్లుపడిన బకెట్‌లో నీళ్లు ఎలా నిలవవో కాంగ్రెస్ హయాంలో పథకాలు అలా తయారయ్యాయని ఆయన ఎద్దేవా చేశారు. అరుణాచల్ ప్రదేశ్‌లో హిందీ భాషను, హిందీ మాట్లాడేవారిని ఆదరిస్తున్నందుకు ప్రభుత్వాన్ని అభినందించారు. ఇటానగర్‌లో కొత్తగా ప్రారంభించిన కనె్వన్షన్ సెంటర్‌ను సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.

చిత్రం..ఇటానగర్‌లోని గవర్నర్ హౌస్‌లో మొక్కను నాటుతున్న ప్రధాని నరేంద్ర మోదీ