జాతీయ వార్తలు

నిందితులకు వెన్నుదన్ను

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 22: కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం వివిధ కుంభకోణాలకు సూత్రధారుల్ని విదేశాలకు పంపేందుకు ఓ పద్ధతి ప్రకారం అవకాశం కల్పిస్తోందని సీపీఏం మాజీ ప్రధాన కార్యదర్శి ప్రకాశ్ కారత్ విమర్శించారు. పార్టీ అధికార ప్రతిక్ష ‘పీపుల్స్ డెమోక్రసీ’ తాజా సంచికలో మోదీ సర్కార్‌పై ఆయన నిప్పులు చెరిగారు. పంజాబ్ నేషనల్ బ్యాంక్ కుంభకోణంపై రాసిన సంపాదకీయంలో కారత్ ‘పీఎన్‌బీ స్కామ్ షాక్‌కు గురిచేసిన కుంభకోణం. దేశ బ్యాంకింగ్ చరిత్రలోనే అతిపెద్ద కుంభకోణం’ అని కారత్ వ్యాఖ్యానించారు. పీఎన్‌బీ స్కామర్లు నీరవ్ మోదీ, మెహుల్ ఛోక్సీ, కుటుంబ సభ్యులు విదేశాలకు పారిపోవడానికి నరేంద్ర మోదీ ప్రభుత్వమే అవకాశం కల్పించిందని ఆయన ఆరోపించారు. కుంభకోణం బయటపడగానే జనవరి మొదటి వారంలోనే నీరవ్ బంధువులకు అనుకూలంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరించిందని కారత్ విరుచుకుపడ్డారు. సీబీఐ అప్రమత్తమయ్యేలోపే నిందితులు దేశందాటి వెళ్లిపోయారని ఆయన అన్నారు. లలిత్‌మోదీ, విజయ్ మాల్యా వ్యవహారాల్లోనూ కేంద్రం తీరు అలాగే ఉందని, పూర్తి అనుమానాస్పదంగా మారిందని అన్నారు.