జాతీయ వార్తలు

జయేంద్ర సరస్వతి మహా సమాధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాంచీపురం, మార్చి 1: మహానిర్యాణం చెందిన కంచికామకోటి పీఠం శంకరాచార్య జయేంద్ర సరస్వతి గురువారం మహాసమాధి అయ్యారు. వేద మంత్రోచ్ఛరణల మధ్య 82 ఏళ్ల జయేంద్ర సరస్వతి బృందావన ప్రవేశం చేశారు. ఇందు కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సమాధిలో కూర్చున్న స్థితిలోనే జయేంద్ర సరస్వతి మహా సమాధి అయ్యారు. ఈ సమాధిని పూర్తిగా గంధపుచెక్కలు, మట్టి ఇతర మూలికలతో నింపారు. దాదాపు మూడున్నర గంటల పాటు ఈ కార్యక్రమం జరిగింది. ఉదయం 7.45 నిముషాలకు మొదలైన ఈ క్రతువుస్వామీజీ మహా సమాధితో ముగిసింది.
వేలాది మంది భక్తుల సమక్షంలో జరిగిన ఈ మహాసమాధి కార్యక్రమంలో తమిళనాడు గవర్నర్ భన్వారీలాల్ పురోహిత్ హాజరయ్యారు. కుర్చీలో చేతులు కట్టుకుని కూర్చున్న స్థితిలోనే జయేంద్ర పార్థీవ దేహానికి
అభిషేకం చేశారు. ఇంతకు ముందు స్వామీజీ పార్థీవ దేహాన్ని బృందావనానికి కుర్చీలోనే తీసుకొచ్చారు. చంద్రశేఖరేంద్ర సరస్వతి బృందావనం పక్కనే జయేంద్ర సరస్వతి మహా సమాధి అయ్యారు. బుధవారం మహా నిర్యాణం చెందిన జయేంద్ర పార్థీవ దేహాన్ని మఠం ప్రాంగణంలోనే కొన్ని గంటలపాటు భక్తుల సందర్శనార్ధం ఉంచారు. స్వామీజీ మహా సమాధిని కళ్లారా చూసిన భక్తులు ఉద్వేగానికి లోనై ఆయనకు భక్తిప్రపత్తులతో వేద మంత్రాలతో నివాళి అర్పించారు. కాగా జయేంద్ర ఆధ్యాత్మిక ప్రభోదనలు మనసావాచా ఆచరించాలని ఆయన స్థానే ఈ పీఠాన్ని అధిష్ఠించనున్న విజయేంద్ర సరస్వతి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఆయన ప్రవచనాలను ఆచరించి ఆధ్యాత్మిక పథంలో జీవనాన్ని సాగించాలని కోరారు.

చిత్రం..బృందావన ప్రవేశం చేస్తున్న జయేంద్ర సరస్వతి