జాతీయ వార్తలు

పాక్‌తో చర్చలే మేలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 1: పాకిస్తాన్‌తో ఘర్షణ వైఖరి విడనాడి సమస్యలు పరిష్కారానికి సామరస్యపూరక చర్చలను ప్రారంభించాలని సీపీఎం కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. పార్టీ ప్రతినిది పీపుల్స్ డెమోక్రసీ సంపాదకీయంలో మాజీ ప్రధాన కార్యదర్శి ప్రకాశ్ కారత్ ఈ విషయాన్ని స్పష్టం చేశారు. పాకిస్తాన్‌తో అన్ని కోణాల్లోనూ చర్చలను మూసివేయడం ద్వారా కేంద్ర ప్రభుత్వం ఇరకాటంలో పడిందని ఆయన అన్నారు. ఇప్పటికైనా ఈ సంఘర్షణ ధోరణి వీడి రెండు దేశాల మధ్య సామరస్యపూరక బంధాన్ని ఏ ర్పరిచే చర్యలు చేపట్టాలని కారత్ సూచించారు. ముఖ్యంగా నియంత్రణ రేఖ, అంతర్జాతీయ సరిహద్దు ప్రాంతంలోనూ కాల్పుల విరమణ ఒప్పందాన్ని పునరుద్ధరించి శాంతయుత పరిస్థితులను బలోపేతం చేయాలని తెలిపారు. ఇందులో భాగంగానే పాకిస్తాన్‌లో సమగ్ర చర్చలను ప్రారంభించాలని సీపీఎం నేత సూచించారు. అసలు పాక్‌తో చర్చల ప్రసక్తేలేదని అన్ని ద్వారాలు మూసివేయడం వల్ల పరిస్థితి మరింత జఠిలం అవుతుందే తప్ప సమస్యలు పరిష్కారానికి ఆస్కారమే ఉండదన్నారు. లక్షిత దాడులు చేయడం వల్ల పాకిస్తాన్‌కు గట్టి గుణపాఠం చెప్పామని నాటి రక్షణ మంత్రి మనోహర్ పారికర్ చేసిన ప్రకటన ప్రస్తావించిన కారత్‌‘లక్షిత దాడులు జరిగినా పాకిస్తాన్ నుంచి సరిహద్దుల్లో కాల్పులు ఆగడం లేదు. ఇప్పటికీ పాకిస్తాన్ సైనికులు, ఉగ్రవాదులు భారత్ దళాలపైనా, సైనిక శిబిరాలపైనా దాడులు చేస్తునే ఉన్నారు’అని గుర్తుచేశారు. 2003 నవంబర్‌లో ఇరుదేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చిందని గత ఏడాది అత్యధిక స్థాయిలో దీని ఉల్లంఘనలు జరిగాయని కారత్ గుర్తుచేశారు. మోదీ సర్కార్ ఒకే పార్శ్వాన్ని దృష్టిలో పెట్టుకుని వ్యవహరిస్తోందని కాశ్మీర్‌లో జరుగుతున్న నిరసనలు వేర్పాటువాద డిమాండ్లన్నీ పాక్ ప్రోద్బలంతో ముందుకొస్తున్నవేనని ప్రధాని మోదీ భావనగా ఆయన పేర్కొన్నారు. కేవలం సైనిక కోణంలోనే కాశ్మీర్ సమస్య పరిష్కరించాలని భావించడం వల్ల పరిస్థితి మరింత జఠిలం అయిందని కారత్ చెప్పారు.