జాతీయ వార్తలు

అస్సాంలో హింసా శకానికి తెర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాముగురిహత్(అస్సాం), మార్చి 1: ఒకప్పుడు హింస, విధ్వంస కాండలతో అట్టుడికిన అస్సాంలో ఇప్పుడు ప్రశాంత వాతావరణం నెలకొందని కేంద్ర హోమ్‌మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పష్టం చేశారు. గత కొనే్నళ్లుగా తాము చేపట్టిన చర్యల వల్ల రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి గణనీయంగా మెరుగైందని, ప్రజాస్వామ్య ప్రక్రియ బలోపేతం అయిందని తెలిపారు. ఒకప్పుడు తుపాకులే రాజ్యం చేసిన ఈశాన్య రాష్ట్రంలో ఇప్పుడు చర్చల ద్వారా ప్రజాస్వామ్యం ఫరిడవిల్లుతోందని రాజ్‌నాథ్ అన్నారు. ఏ సమస్య పరిష్కారికైనా చర్చలే మార్గమని తుపాకీ సంస్కృతికి అసలు ఆస్కారమే ఉండకూడదని తాను 2014 డిసెంబర్‌లోనే చెప్పిన విషయాన్ని గుర్తుచేసిన రాజ్‌నాథ్ ‘ఇప్పుడు రాష్ట్రంలో పరిస్థితులు ఎంతగానో మెరుగయ్యాయి. శాంతి నెలకొంది. హింసా శకానికి తెరపడింది’అని తెలిపారు. ఉల్ఫా, ఎన్‌డీఎఫ్‌డీ వంటి ఎన్నో అతివాద సంస్థల చర్యల కారణంగా కొనే్నళ్లపాటు అస్సాం హింసా విధ్వంస కాండలతో అట్టుడికిపోయిందని గుర్తుచేసిన హోమ్‌మంత్రి ఇప్పుడు పరిస్థితులు గుణాత్మకంగా మారడం ఎంతో సంతోషాన్ని కలిగిస్తోందని అన్నారు. ప్రతి ఆరేళ్లకు ఓ సారి ఇక్కడ జరిగే బారే చహారియా భావోనా 28వ ఉత్సవాన్ని ప్రారంభించడానికి వచ్చిన రాజ్‌నాథ్‌‘ సాధారణంగా ఇలాంటి సాంప్రదాయక, చారిత్రక కార్యక్రమాలకు నేను రాను. 220 ఏళ్ల క్రితం ఈ ఉత్సవం మొదలైంది. అందుకే తొలిసారిగా దీని ప్రారంభానికి వచ్చాను’అని తెలిపారు. సాంస్కృతిక సామరస్యాన్ని కాపాడుకోవాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చిన రాజ్‌నాథ్ దాదాఫాల్కే అవార్డు గ్రహీత భుపేన్ హజారికా పేరును ప్రస్తావిస్తూ‘యావత్ భారతావనికి అస్సాం అందించిన కానుక ఆయన’అని పేర్కొన్నారు.
నేనేం మాట్లాడను
మాజీ ఆర్థిక మంత్రి పి చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరం అరెస్టుపై తానేమీ మాట్లాడేది లేదని రాజ్‌నాథ్ స్పష్టం చేశారు. అన్ని విధాలుగా బలమైన సాక్షాలను సేకరించిన మీదట విశ్వసనీయరీతిలోనే సీబీఐ ముందుకు సాగుతోందని చెప్పారు. చట్టపరంగా సీబీఐ తన పనితాను చేసుకుపోతోందని ఈ విషయంలో తాను మాట్లాడేది ఏమీ లేదని హోమ్‌మంత్రి వ్యాఖ్యానించారు.