జాతీయ వార్తలు

అభివృద్ధే మన అభి‘మతం’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 1: ఉగ్రవాదంపై పోరాటం జరుగుతోంది తప్ప ఒక మతంపై కాదని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. నరేంద్రమోదీ గురువారం ‘ఇస్లామిక్ వారసత్వం- అవగాహన పెంపుదల, మధ్యవర్తిత్వం’ అనే అంశంపై జరిగిన సదస్సులో కీలక ప్రసంగం చేశారు. జోర్డాన్ రాజు అబ్దుల్లా కూడా సదస్సుకు హాజరయ్యా రు. తమ ప్రభుత్వం ఏ మతానికి వ్యతిరేకంగా పని చేయటం లేదని యువతను తప్పుదోవ పట్టిస్తున్న వారు, మతతత్వాన్ని నూరిపోస్తున్న వారికి వ్యతిరేకంగా పోరాటం చేస్తోందని మోదీ ఈ సందర్భంగా చెప్పారు. ముస్లింలకు ఒక చేతిలో ఖురాన్ ఉంటే మరో చేతిలో కంప్యూటర్ ఉండాలని ఆయన ఉద్ఘాటించారు. ప్రతి మతం కూడా మానవత విలువలను బోధిస్తుంది, అయితే కొంద రు మాత్రం ఇందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని ఆయన విమర్శించారు. సామాజిక వైవిద్య బలంతో ఉగ్రవాదంపై పోరాటం జరపాలని ప్రధాని పిలుపునిచ్చారు. ‘్భరత దేశం ప్రపంచంలోని అన్ని మతాలకు నీడనిచ్చింది. బహువారసత్వానికి మన ప్రజాస్వామ్యం అద్దం పడుతోంది’అని ఆయన అన్నారు. దేశంలో పలు మతాలు ఊపిరిపోసుకోవటంతోపాటు విలసిల్లాయని మోదీ చెప్పారు. ప్రపంచంలోని అన్ని పెద్ద మతాలు భారత దేశంలో పెరిగాయన్నారు. రెండున్నర వేల ఏళ్ల పూర్వం బుద్ధుడు చేసిన బోధనలు, గత శతాబ్దంలో మహాత్మా గాంధీ బోధనలు మానవతా విలువలు ప్రపంచం నలుదిశలా వ్యాపించాయని ఆయన అన్నారు. అందరిలో ఒకే వెలుగు ఉంటుందనేది ఈ బోధనల సారమని ప్రధాని నొక్కి చెప్పారు. అందరిలో ఒకే దేవుడు ఉంటాడనేది అన్ని మతాలు బోధించాయన్నారు. గంగా, యమున సంస్కృతికి దేశ రాజధాని ఢిల్లీ ప్రతీక అని ఆయన తెలిపారు. ప్రపంచమంతా ఒకే కుటుంబం అనే సందేశం భారత దేశం నుండి వెళ్లిందన్నారు. ఉగ్రవాదం, ఉగ్రవాద చర్యలను సమర్థించే వారి వల్లనే ఆ మతానికి నష్టం కలుగుతుందని ఆయన హెచ్చరించారు. దేశంలోని అన్ని మతాలు, వర్గాల ప్రజల అభివృద్ధికి కృషి జరుగుతోందని మోదీ స్పష్టం చేశారు. అన్ని వర్గాల ప్రజలు అభివృద్ధి సాధ్యమన్నారు. యువత ముస్లిం మతంలోని మానవతా విలువలను జీర్ణించుకోవాలి, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకునే స్థాయికి ఎదగాలని నరేంద్ర మోదీ అభిలషించారు. అన్ని మతాలు మానవతా విలువలను బోధిస్తాయనేది మరిచిపోరాదని మోదీ చెప్పారు. కలిసికట్టుగా ఉగ్రవాదం, ఉగ్రవాద కార్యక్రమాలపై తలపడాలని ఆయన పిలుపు ఇచ్చారు. ఇస్లాం మతం నిజస్వరూపాన్ని ప్రతిష్టాపించేందుకు కింగ్ అబ్దుల్లా చేస్తున్న ప్రయత్నాలను మోదీ కొనియాడారు. యువతను ఉగ్రవాదం నుంచి మళ్లించేందుకు కింగ్ అబ్దుల్లా ఎంతో కృషి చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు.
చిత్రం....ఢిల్లీలో జరిగిన ఓ సదస్సులో జోర్డాన్ రాజు అబ్దుల్లాతో మోదీ