జాతీయ వార్తలు

దేశ రక్షణతోనే అభివృద్ధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 1: సాయుధ దళాల ఆధునీకరణతోపాటే దేశ ఆర్థిక అభివృద్ధి జరగాలని ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ గురువారం ఇక్కడ స్పష్టం చేశారు. ఒక దేశం అన్ని విధాలుగా సురక్షితంగా ఉన్నప్పుడే ఆర్థిక అభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్న ఆయన సైనిక దళాలకు భారీగా బడ్జెట్‌లో నిధులు కేటాయించడాన్ని సమర్ధించారు. భారత్‌లోకి విదేశీ పెట్టుబడులు గణనీయంగా రావాలంటే సరిహద్దుల్లో ప్రశాంతత, అంతర్గ శాంతి ఎంతైనా అవసరమని అన్నారు. దేశంలో అన్ని విధాలుగా సురక్షితమైన పరిస్థితులు ఉన్నాయని ఎక్కడా ఏ రకంగానూ సమస్యలు తలెత్తే అవకాశం లేదన్న ధీమాను బలంగా కలిగించినప్పుడే ఇనె్వస్టర్లలో నమ్మకం పెరుగుతుందని అప్పుడే పెట్టుబడులు భారీగా వస్తాయని అభిప్రాయపడ్డారు. ఇక్కడ జరిగిన సెమినార్‌లో మాట్లాడిన రావత్ మారుతున్న అవసరాలకు అనుగుణంగా రక్షణ కేటాయింపులను ఎప్పటికప్పుడు పెంపొందించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. ముఖ్యంగా ఆర్థిక అభివృద్ధి అన్నది నిరాటంకంగా జరగాలంటే సైనిక ఆధునీకరణ కూడా అంతే వేగంతో ముందుకు సాగాలని అన్ని విధాలుగా దేశ రక్షణకు ఇది దోహదం చేయాలని ఆయన అన్నారు. సైనిక దళాలకు భారీగా బడ్జెట్‌ను కేటాయించడంపై తలెత్తుతున్న ప్రశ్నలను ప్రస్తావించిన ఆయన ‘సైనిక దళాలకు వార్షిక బడ్జెట్‌లో దాదాపు 37 శాతం మొత్తాన్ని కేటాయించడం వల్ల సాయుధ బలాగాలు బలపడడమే కాకుండా ఇది దేశాభివృద్ధికి, దేశ పునర్నిర్మాణానికి ఎంతగానో ఉపయోగపడుతుంది’అని అన్నారు. దేశ వ్యాప్తంగా రహదారులను మారుమూల ప్రాంతాల్లో వౌలిక సదుపాయాలను కల్పించడం వల్ల స్థానిక ప్రజానికానికి ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పారు. అలాగే మారుమూల ప్రాంతాలల్లోని ప్రజలకు సైనిక దళాలు విద్య, ఆరోగ్య సౌకర్యాలను కల్పిస్తున్నాయని ప్రభుత్వం సౌకర్యాలు అందుబాటులోకి రాని ప్రాంతాల్లోకి వెళ్లి మరీ ఈ సౌలభ్యాలను సైన్యం కల్పిస్తోందని రావత్ పేర్కొన్నారు.

చిత్రం..సెమినార్‌లో మాట్లాడుతున్న ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్