జాతీయ వార్తలు

మద్యపాన నిషేధం అసాధ్యం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై, మార్చి 1: మద్యపాన నిషేధం వల్ల పరిస్థితి మరింత జఠిలమై కొత్త మాఫియా పుట్టుకురావడానికి ఆస్కారం ఉందని మక్కల్‌నీతి మయ్యం అధినేత కమల్‌హసన్ అన్నారు. తాము అధికారంలోకి వస్తే మద్యపానాన్ని నిషేధిస్తామని చెబుతున్న పార్టీలు మహిళా ఓటర్లను దృష్టిలో పెట్టుకునే అలాంటి హామీలు ఇస్తున్నాయని ఆరోపించారు. తమిళనాడులో లిక్కర్ అమ్మకాలను జాతీయం చేశారని అన్ని రకాల బ్రాండ్లు ప్రభుత్వ ఆధీనంలో నడుస్తున్న తమిళనాడు రాష్ట్ర మార్కెటింగ్ కార్పొరేషన్ విక్రయిస్తోందని గుర్తుచేశారు. ఇప్పటి వరకూ ఎన్నికల్లో పోటీ చేసిన డిఎంకే, అన్నాడిఎంకేలు తమ మేనిఫెస్టోల్లో మద్యపాన నిషేధంపై హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చినవేనని ఆయన అన్నారు. కానీ రాష్ట్రంలో పోస్ట్ఫాసులకంటే కూడా ఈ మద్యపాన విక్రయ కేంద్రాలే ఎక్కువగా కనిపిస్తాయని కమల్ చెప్పారు. ఒక వేళ మద్యపాన నిషేధాన్ని అమలుచేస్తే మాఫియా పుట్టుకొస్తోందని పేర్కొన్న ఆయన కల్తీ మద్యం ఉదంతాలను గుర్తుచేశారు. గ్యాంబ్లింగ్‌ను అదుపుచేసినంత కఠిన స్థాయిలో మద్యపాన నిషేధాన్ని అమలుచేయలేరని పేర్కొన్న ఆయన ఒక్కసారిగా మద్యం అందుబాటులోలేకపోతే దానికి అలవాటుపడ్డవారు భరించలేరని కమల్ హసన్ అన్నారు. మద్యపానాన్ని అదుపుచేయవచ్చునేమోగానీ దాన్నిపూర్తిగా నిషేధించడం అన్నది సాధ్యం కాకపోవచ్చునేమోనన్న సందేహాన్ని ఆయన వ్యక్తం చేశారు. అదే క్రమంలో రాష్ట్రంలో ఎక్కడబడితే అక్కడ మద్యం విక్రయ షాపులను తెరవాల్సిన అవసరమూ లేదని ఆనంద్ వికటన్ అన్న పత్రికలో రాసిన వ్యాసంలో కమల్ స్పష్టం చేశారు.