జాతీయ వార్తలు

సున్నానుంచి శిఖరాగ్రానికి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 3: స్థిరమైన అభివృద్ధి అజెండా, పార్టీ యంత్రాంగం కృషితో త్రిపురలో భారతీయ జనతా పార్టీ సున్నానుంచి శిఖరాగ్రానికి చేరిందని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. త్రిపుర, నాగాలాండ్, మేఘాలయ అసెంబ్లీ ఎన్నికల ఫలితాపై వరుస ట్వీట్లు చేస్తూ, త్రిపురలో బీజేపీది ‘అసాధారణ విజయం’గా అభివర్ణించారు. ‘స్థిరమైన అభివృద్ధి నినాదం బలంగా పని చేసింది. అదే సమయంలో పార్టీ శ్రేణులు కంకణబద్ధులై పని చేశారు. ఈ రెండే బీజేపీని అనితర సాధ్యమైన విజయానికి దగ్గర చేశాయి. మేమిప్పుడు శూన్యం నుంచి శిఖరాగ్రానికి చేరుకున్నాం’ అంటూ ప్రధాని మోదీ ఆనందంగా వరుస ట్వీట్లు చేశారు. అలాగే ఈశాన్య రాష్ట్రాల ప్రజలు బీజేపీ పట్ల అచెంచల నమ్మకాన్ని ప్రదర్శించారని, ఎన్డీయే సమగ్ర అభివృద్ధి నినాదాన్ని బలంగా సమర్థించారని అన్నారు. ‘ప్రత్యర్థి పక్షాల విధ్వంసక రాజకీయాన్ని ఈశాన్య ప్రజలు తిప్పికొట్టారు. అలాంటి రాజకీయ ధోరణులకు ఇకనైనా స్వస్తి పలకాలని స్పష్టమైన సంకేతాలిచ్చారు’ అని మోదీ ట్వీట్ చేశారు. త్రిపురలో బీజేపీ విజయాన్ని ప్రస్తావిస్తూ ‘ఇది దుష్టశక్తుల నుంచి ప్రజాస్వామ్యాన్ని కాపాడుతున్న అతి గొప్ప విజయం. శాంతి, అహింసలు భయంపై విజయం సాధించాయి. త్రిపుర ప్రజలు కోరుకుంటున్న పాలన కంటే మెరుగైన పాలన, అభివృద్ధినే అందించగలమని చిత్తశుద్ధితో ప్రకటిస్తున్నా’ అని మోదీ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.
బీజేపీ దాని మిత్రపక్షాలను బలంగా సమర్థించినందుకు త్రిపుర సహా నాగాలాండ్ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ‘నాగాలాండ్ సోదర సోదరీమణులకు హామీ ఇస్తున్నా. నాగాలాండ్ సమగ్రత, అభివృద్ధికి కంకణబద్ధుడినై పనిచేస్తాం’ అన్నారు. అలాగే అలుపెరుగని కృషి సలిపిన బీజేపీ శ్రేణులను ప్రశంసించారు. ఎన్డీయే ప్రభుత్వానికి మేఘాలయ సంక్షేమం, అభివృద్ధి అత్యంత ప్రాధాన్యతాంశమని ప్రధాని నరేంద్ర మోదీ ఒక ట్వీట్‌లో స్పష్టం చేశారు.

చిత్రం..ఢిల్లీలోని బీజేపీ జాతీయ కార్యాలయంలో మాట్లాడుతున్న ప్రధాని నరేంద్ర మోదీ