జాతీయ వార్తలు

కర్నాటకలోనూ మేమే గెలుస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 3: త్వరలో జరగనున్న కర్నాటక శాసనసభ ఎన్నికల్లోనూ బీజేపీ ఘనవిజయం సాధిస్తుందని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ప్రకటించారు. అనంతరం పశ్చిమ బెంగాల్, ఒడిశా, కేరళలో అధికారంలో సాధించినప్పుడే బీజేపీకి స్వర్ణయుగం అని ఆయన తెలిపారు. బీజేపీకి గోల్డన్ పిరియడ్ ఎప్పుడు వస్తుందని మీరు చాలాకాలం నుండి అడుగుతున్నారు. పశ్చిమ బెంగాల్, ఒడిశా, కేరళలో విజయం సాధించినప్పుడే మా పార్టీకి స్వర్ణయుగం ప్రారంభం అవుతుందని షా తెలిపారు. అమిత్ షా శనివారం సాయంత్రం ఢిల్లీలోని పార్టీ జాతీయ కార్యాలయంలో విలేఖరులతో మాట్లాడుతూ ఈశాన్య రాష్ట్రాల్లో బీజేపీ ఘనవిజయం సాధించటం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అవలంభించిన అభివృద్ధి మంత్రం మూలంగానే త్రిపురలో భారీ మెజారిటీతో అధికారంలోకి వస్తున్నామని ఆయన చెప్పారు. త్రిపురలో తమకు పూర్తి మెజారిటీ లభించినా మిత్రపక్షాలను మంత్రివర్గంలో చేర్చుకుంటామని అమిత్ షా ప్రకటించారు. త్రిపురలో బీజేపీ శూన్యం నుండి శిఖరానికి చేరిందన్నారు. గత ఎన్నికల్లో బీజేపీ కేవలం ఒక్క సీట్లో మాత్రమే డిపాజిట్‌ను కాపాడుకున్నదని ఆయన తెలిపారు. నాగాలాండ్‌లో తమ మిత్రపక్షం మంచి సీట్లు సంపాదించింది. వారితో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. మేఘాలయంలో కూడా ఎన్‌డీఏ మిత్రపక్షాలకు మంచి సీట్లు లభించాయన్నారు. ఈ మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు త్వరలోనే జరుగనున్న కర్నాటక శాసనసభ ఎన్నికలు, ఆ తరువాత ఇతర రాష్ట్రాల్లో జరిగే ఎన్నికల ఫలితాలను ప్రతిబిందిస్తున్నాయని అమిత్ షా చెప్పారు. బీజేపీ కేవలం హిందీ రాష్ట్రాల పార్టీ అని గతంలో ముద్ర వేసేవారు, అయితే ఇప్పుడు ఈశాన్య రాష్ట్రాల్లో సాధించిన విజయం తమకు జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చిందన్నారు. త్రిపుర, నాగాలాండ్‌లో బీజేపీ సాధించిన విజయం వలన పశ్చిమ బెంగాల్, కేరళ రాష్ట్రాలకు చెందిన పార్టీ కార్యకర్తలు ఎంతో ఆనందంగా ఉన్నారని ఆయన చెప్పారు. పశ్చిమ బెంగాల్, కేరళ రాష్ట్రాల్లో తమ కార్యకర్తలు వామపక్షాల హింసకు అసువులు బాసారని అన్నారు. త్రిపుర విజయం చారిత్రాత్మాకమని ఆయన అభిప్రాయపడ్డారు. మూడు రాష్ట్రాల్లో ప్రజలు కాంగ్రెస్‌ను తిరస్కరించారని అమిత్ షా అన్నారు. త్రిపుర, నాగాలాండ్‌లో కాంగ్రెస్ ఒక్క సీట్లు కూడా గెలవకపోవటం ఆ పార్టీ దుస్థితికి అద్ద పడుతోందన్నారు. లెఫ్ట్ దేశంలోని ఈ ప్రాంతానికి కూడా రైట్ కాదనేది మూడు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు నిరూపించాయని షా వ్యంగ్యంగా అన్నారు. పశ్చిమ బెంగాల్, త్రిపురలో వామపక్షాల ఓటమికి కారణం బీజేపీయేనని అన్నారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం వెనుకబడిన వర్గాలు, గిరిజనులు, మహిళలు ఇతర బడుగు వర్గాల అభ్యున్నతికోసం పని చేస్తోంది అందుకే ఇప్పుడీ విజయం సాధ్యమైందన్నారు. త్రిపురలో గిరిజనులకు రిజర్వు చేసిన 20 సీట్లలో బీజేపీ విజయం సాధించించటం తమ విజయమన్నారు. మోదీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఈశాన్య రాష్ట్రాల్లో శాంతి నెలకొల్పేందుకు కృషి చేస్తున్నారని, ఈశాన్య రాష్ట్ర ప్రజలు అభివృద్ధిని కోరుకుంటున్నారని అన్నారు. ఎన్‌డీఏ ఇప్పుడు 21 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నదని అన్నారు.
చిత్రాలు....విజయోత్సవ సంబరాల్లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, కార్యకర్తలు