జాతీయ వార్తలు

త్రిపురలో లెఫ్ట్‌ఫ్రంట్ పతన ప్రస్థానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అగర్తలా, మార్చి 3: త్రిపురలో సిపిఐ(ఎం) నేతృత్వంలోని వామపక్ష కూటమి (ఎల్‌ఎఫ్) పరిస్థితి కడుదయనీయంగా మారింది. త్రిపురలో మొత్తం 60 అసెంబ్లీ స్థానాలుండగా, 1978లో మొత్తం 56 సీట్లను కైవసం చేసుకొని తన తిరుగులేని ఆధిపత్యాన్ని సాధించింది. నాటి మొట్టమొదటి లెఫ్ట్ ప్రభుత్వానికి నృపేన్ చక్రవర్తి నేతృత్వం వహించారు. కాంగ్రెస్ కనీసం ఖాతా తెరవలేదు. ఇక త్రిపుర ఉపజాతి జుబాసమితి (టియుజెఎస్) మాత్రం చచ్చీ చెడి నాలుగు సీట్లను గెలుచుకుంది. ఇక 1983 అసెంబ్లీ ఎన్నికల్లో లెఫ్ట్‌ఫ్రంట్ 39 సీట్లు గెలుచుకోగా, కాంగ్రెస్-టియుజెఎస్ కూటమి 20 స్థానాల్లో గెలుపు సాధించాయి. అమ్రా బంగాలీ ప్రాంతీయ పార్టీ ఒక్కస్థానాన్ని దక్కించుకుంది. ఎల్‌ఎఫ్ గెలుచుకున్న 39 స్థానాల్లో సిపిఐ (ఎం) గెలుచుకున్నవి 37 సీట్లు. మరోరెండు రివల్యూషనరీ సోషలిస్టు పార్టీ స్థానాలు. కాంగ్రెస్ 14 స్థానాల్లో, టియుజెఎస్ ఆరు స్థానాల్లో గెలుపొందాయి. కాగా 1988 ఎన్నికల్లో కాంగ్రెస్-టియుజెఎస్ కూటమి, వామపక్ష కూటమిని ఓడించింది. కాంగ్రెస్ కూటమికి మొత్తం 30 సీట్లు రాగా, ఎల్‌ఎఫ్‌కు 29 సీట్లు దక్కాయి. మొత్తానికి కాంగ్రెస్ కూటమి అధికారంలోకి వచ్చింది. 1993లో ఎల్‌ఎఫ్ మొత్తం 49 స్థానాల్లో గెలిచి తిరిగి అధికార పగ్గాలు చేపట్టింది. కాంగ్రెస్ కేవలం 10 స్థానాలతో, టియుజెఎస్ ఒక్క స్థానంతో సంతృప్తి పడాల్సి వచ్చింది. అదేవిధంగా 1998, 2003 ఎన్నికల్లో వరుసగా 41 స్థానాల్లో విజయం సాధించి లెఫ్ట్ ఫ్రంట్ అధికారాన్ని నిలబెట్టుకుంది. 1998 ఎన్నికల్లో 19 సీట్లలో కాంగ్రెస్-టియుజెఎస్ కూటమి విజయం సాధించింది. మాణిక్ సర్కార్ ముఖ్యమంత్రి అయ్యారు. ఇక 2003లో కాంగ్రెస్ 13 సీట్లు గెలుచుకుంది. 2008లో జరిగిన ఎన్నికల్లో కూడా ఎల్‌ఎఫ్ 49 స్థానాల్లో విజయం సాధించి తన ఆధిపత్యాన్ని నిలుపుకుంది. కాంగ్రెస్‌కు 10 స్థానాలు మాత్రమే దక్కాయి. 2013 ఎన్నికల్లో ఎల్‌ఎఫ్ స్థానాలు 50కి పెరిగాయి. కాంగ్రెస్ 10 సీట్లకే పరిమితమైంది. ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు 2016లో తృణమూల్ కాంగ్రెస్‌లో చేరారు. తర్వాత వీరంతా బిజెపిలో చేరడం మరో పరిణామం.