జాతీయ వార్తలు

బోఫోర్స్‌తో పోలికే లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 3: రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలులో అవినీతి చోటుచేసుకుందన్న ఆరోపణలను రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ కొట్టివేశారు. ఈ 36 రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు వ్యవహారం బోఫోర్స్ తరహాలో మసకబారుతుందన్న అభియోగాలను ఆమె తిరస్కరించారు. బోఫోర్స్ శతఘు్నల ఒప్పందానికి, రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందానికి మధ్య ఏ రకమైన పోలికా లేదని తేల్చి చెప్పారు. ఈ వ్యవహారంలో ఎలాంటి అవినీతి చోటుచేసుకోలేదని స్పష్టం చేశారు. సోమవారం నుంచి మళ్లీ ప్రారంభం కానున్న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు అంశాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రస్తావిస్తే తానెంతో సంతోషిస్తానన్నారు. కాంగ్రెస్ పాలనలో ఈ విమానాల కొనుగోలుకు సంబంధించి కుదుర్చుకున్న ఒప్పందానికి మోదీ హయాంలో కుదిరిన కాంట్రాక్టుకు కూడా ఏ రకంగానూ పోలిక లేదని, మొత్తం 58వేల కోట్ల రూపాయల వ్యయంతో 36 రాఫెల్ యుద్ధ విమానాలను తమ ప్రభుత్వం కొనుగోలు చేస్తోందన్నారు. యూపీఏ హయాంలో మొత్తం 126 రాఫెల్ విమానాలను కొనుగోలు చేయాలని భావించారని, అయితే ఆ ఒప్పందం తుది దశకు వచ్చిన సమయంలో అప్పటి రక్షణ మంత్రి ఏకే ఆంటోనీ జోక్యంతో మొత్తం వ్యవహారం ఆగిపోయిందని అధికార వర్గాలు ఈ సందర్భంగా తెలిపాయి.