జాతీయ వార్తలు

భారత్-వియత్నాల మధ్య వ్యూహాత్మక సహకారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 3: ప్రధాని నరేంద్ర మోదీ, వియత్నాం అధ్యక్షుడు ట్రన్ డాయ్ క్వాంగ్ రెండు దేశాల మధ్య కీలకమైన రక్షణ, వాణిజ్య రంగాల్లో సహకారంపై చర్చలు జరిపారు. న్యూఢిల్లీలోని హైదరాబాద్ హౌజ్ వద్ద ప్రధాని, వియత్నాం అధ్యక్షుడిని సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా శనివారం జరిపిన చర్చల్లో అణువిద్యుత్ రంగం వీరి చర్చల్లో ప్రధానంగా ప్రస్తావనకు వచ్చింది. అంతకుముందు వియత్నాం అధ్యక్షుడిని, విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ కలుసుకున్నారు. రెండు దేశాల మధ్య వ్యూహాత్మక సహకారంపై వీరు ప్రధానంగా చర్చించినట్టు విదేశాంగ శాఖ ప్రతినిధి రవీశ్‌కుమార్ తెలిపారు. రాష్టప్రతి భవన్‌లో క్వాంగ్‌కు ఘనస్వాగతం లభించింది.

చిత్రం..వియత్నాం అధ్యక్షుడు ట్రన్ డాయ్ క్వాంగ్‌తో నరేంద్ర మోదీ