జాతీయ వార్తలు

మళ్లీ.. రణరంగమే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 4: సోమవారం నుండి తిరిగి ప్రారంభమవుతున్న పార్లమెంటు బడ్జెట్ మలి సమావేశాల్లో పీఎన్‌బీ కుంభకోణాన్ని లేవనెత్తటం ద్వారా ఎన్‌డీఏ ప్రభుత్వాన్ని కడిగిపారేసేందుకు ప్రతిపక్షం సిద్ధమవుతుంటే, అధికార పక్షం మాత్రం ఈశాన్య రాష్ట్రాల్లో సాధించిన ఘనవిజయంతో ప్రతిపక్షాలను రాజకీయంగా దెబ్బతీసేందుకు ఎత్తులు వేస్తోంది. ఎన్‌డీఏ మిత్రపక్షమైన తెలుగుదేశం, అధికార పక్షం పట్ల సానుకూల వైఖరిని అవలంభిస్తున్న వైఎస్‌ఆర్‌సీపీ, టీఆర్‌ఎస్ పార్టీలు కూడా విభజన చట్టం హామీల అమలు, ప్రత్యేక హోదా సాధనకోసం ప్రభుత్వంపై ధ్వజమెత్తనున్నాయి. తెలుగుదేశం, వైఎస్‌ఆర్‌సీపీతో పాటు టీఆర్‌ఎస్ కూడా విభజన చట్టం హామీల గురించి ప్రస్తావించటం ద్వారా ఉభయ సభలను స్తంభింపజేసేందుకు సిద్ధమయ్యాయి. ఎన్‌డీఏ ప్రభుత్వం ముఖ్యంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు వైఖరిలో వచ్చిన మార్పు మూలంగా టీఆర్‌ఎస్ కూడా ఉభయ సభల్లో గొడవ చేయనున్నది.
పంజాబ్ నేషనల్ బ్యాంకులో జరిగిన 12వేల కోట్ల రూపాయల కుంభకోణం గురించి పార్లమెంటు మలి సమావేశాల్లో ప్రతిపక్షం ప్రధానంగా చర్చించనున్నది. అవినీతిని అంతమొందిస్తానన్న నరేంద్ర మోదీ హయంలో ఇంత పెద్ద కుంభకోణం ఎలా జరిగిపోయిందంటూ ప్రతిపక్షాలు ఎన్‌డీఏ ప్రభుత్వాన్ని నిలదీయనున్నాయి. పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు దాదాపు నెల రోజుల తరువాత తిరిగి సమావేశం అవుతున్నాయి. ఈ మధ్య కాలంలో పీఎన్‌బీ కుంభకోణం వెలుగులోకి రావటంతోపాటు, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పి.చిదంబరం కుమారుడు కార్తి చిదంబరం ఒక కుంభకోణం కేసులో అరెస్టయ్యాడు. ఇటీవల జరిగిన కొన్ని ఉపఎన్నికలో కాంగ్రెస్, ఇతర పార్టీలు గెలిస్తే, మూడు ఈశాన్య రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘనవిజయం సాధించింది. త్రిపురలో భారీ మెజారిటీ లభిస్తే,
నాగాలాండ్‌లో మిత్రపక్షాలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు
చేస్తోంది. మేఘాలయంలో అధికారాన్ని చేజిక్కించుకునేందుకు ఎత్తులు వేస్తోంది. ఈ నేపథ్యంలో పునః ప్రారంభం అవుతున్న బడ్జెట్ సమావేశాల్లో గొడవ, గందరగోళం చోటుచేసుకోకతప్పదని విశే్లషకులు అంచనా వేస్తున్నారు. తెలుగుదేశం ఎంపీలను శాంతింపజేసేందుకు బీజేపీ అధినాయకత్వం చేస్తున్న ప్రయత్నాలు ఫలించకపోతే ఉభయ సభల్లో గొడవ తప్పదు. తెలుగుదేశం, వైఎస్‌ఆర్‌సీపీకి ఇప్పుడు టీఆర్‌ఎస్ కూడా తోడైతే ఉభయ సభల్లో గొడవ మరింత ఉధృతం అయ్యే ప్రమాదం ఉన్నది. త్రిపురలో అధికారాన్ని కోల్పోయిన కోపంతో ఉన్న వామపక్షాలు ముఖ్యంగా సీపీఎం కేంద్ర ప్రభుత్వాన్ని దెబ్బతీసేందుకు అన్ని విధాల ప్రయత్నిస్తుందని చెబుతున్నారు. విజయ్ మాల్యా దేశం విడిచిపోయేందుకు సహకరించిన ఎన్‌డీఏ ప్రభుత్వం ఇప్పుడు వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ కూడా దేశం విడిచి పారిపోయేందుకు తోడ్పడిందని ప్రతిపక్షం ఆరోపించటం తెలిసిందే. పీఎన్‌బీ కుంభకోణం విషయంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఒకరిపై మరొకరు దుమ్మెత్తిపోసుకుంటున్నారు. కాంగ్రెస్ పీఎన్‌బీ కుంభకోణం గురించి ప్రస్తావిస్తే, బీజేపీ చిదంబరం కుమారుడు కార్తి చిదంబరం అరెస్టు గురించి ప్రస్తావించనున్నది. ఈ సమావేశాల్లో బీసీ జాతీయ కమిషన్‌కు రాజ్యాంగ హోదా కల్పించేందుకు ఉద్దేశించిన బిల్లుకు పార్లమెంటు ఆమోదం తీసుకునేందుకు అధికార పక్షం ప్రయత్నిస్తోంది.
*
లాభమిసుమంత లేకయె
క్షోభకు గురియైన తెలుగు సోదరులొకటై
సభలో రభసనుజేసిన
విభజన హామీలు తీర్చు వేల్పా మోదీ?!