జాతీయ వార్తలు

విద్వేష రాజకీయాలకు చరమగీతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు, మార్చి 4: ఈశాన్య భారత ప్రజలు విద్వేష రాజకీయాలను తిరస్కరించడం ద్వారా భాజపాకు ఏకగ్రీవంగా ఓటు చేసి అధికారాన్ని అప్పగించారని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఇక్కడికి 70 కిలోమీటర్ల దూరంలోని తూమకూరులోని రామకృష్ణ వివేకానంద ఆశ్రమంవారు, సిస్టర్ నివేదిత 150 జయంతిని పురస్కరించుకొని నిర్వహిస్తున్న రజతోత్సవాలను పురస్కరించుకొని ఆదివారం ఏర్పాటు చేసిన యువజన సదస్సునుద్దేశించి, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన ప్రసంగించారు. సిస్టర్ నివేదిత ఒక సామాజిక కార్యకర్త. వివేకానందుడి ముఖ్య శిష్యురాలు. ఈ సందర్భంగా ‘యువశక్తి: నవ భారత్ కోసం నూతన దృష్టికోణం’ అన్న అంశంపై ఆయన ప్రసంగించారు. ‘ఈశాన్య ప్రాంతానికి చెందిన సోదర సోదరీమణులు భాజపాకు అధికారాన్ని కట్టబెట్టడంతోవిద్వేష రాజకీయాలకు చరమగీతం పాడినట్లయింది. త్రిపుర ఎన్నికల ఫలితాలు ఎంతో ఆనందాన్నిచ్చాయి. సమైక్యత ద్వారానే రాడికలిజంకు దీటైన సమాధానం చెప్పవచ్చు’ అన్నారు.
ఈ సందర్భంగా ఆయన గతంలో ఈశాన్య భారత్‌లో అధికారం నెరపిన కాంగ్రెస్, వామపక్ష పాలనపై విరుచుకుపడ్డారు. గతంలోని ప్రభుత్వాలు అనుసరించిన విధానాలు కేవలం ఈశాన్య భారత్‌కు ప్రత్యేకించినవై ఉండేవి. అంతేకాని వీరిని దేశ ప్రధాన స్రవంతిలో కలిపేందుకు ఏవిధంగాను కృషి చేయలేదు. పలితంగా ఈ ప్రాంతవాసులు ఎల్లప్పుడూ తాము పరాధీన భావంలోనే ఉండిపోయారు. కానీ ప్రస్తుతం పరిస్థితి మారింది. ప్రస్తుత ప్రభుత్వం అటువంటి అభిప్రాయాలకు తావివ్వదు. ఈశాన్య భారత ప్రజలు.. తాముకూడా దేశ ప్రధాన స్రవంతిలో భాగమని భావించేలా విధానాలు రూపొందిస్తుందన్నారు. ‘‘దేశంలోని ఏ ప్రాంతం కూడా పరాధీన భావన లేకుండా, దేశవాసులందరూ ఒక్కటిగా కలసిమెలసి పనిచేసే విధంగా మా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. ఇది రుజువైన సత్యం’’ అన్నారు. ఇదే రకమైన విలీనతాభావం కర్ణాటక ప్రజల్లో కూడా మరింతగా విస్తరిస్తుందన్నారు. ఈశాన్య భారతంలో వచ్చిన అసెంబ్లీ పలితాలు ఆ ప్రాంత వాసులకు ఆనందాన్ని కలిగిస్తున్నాయని, వారి ఆలోచనలు, స్వప్నాల సాక్షాత్కారం కోసం, వారి వెంట ఉంటామని దేశం వారికి గట్టి సందేశం ఇచ్చిందన్నారు. ఆవిధంగా ఈశాన్య భారత ప్రజల అభిప్రాయాలకు దేశం సంఘీభావం తెలపడం ఒక గొప్ప అంశం మాత్రమే కాదు, అవసరం కూడా అన్నారు. అంతేకాదు అసెంబ్లీ ఫలితాలు, దేశవాసులు ఈశాన్య ప్రాంత ప్రజల ఆనందంలో పాలుపంచుకోవడానికి దారితీశాయన్నారు. ఈశాన్య భారత్‌లోని ఎన్నికల విజయాన్ని ‘తాము సాధించిన విజయం’గా, ఇతర రాజకీయ పార్టీల ఓటమిగా తాను పరిగణించడంలేదంటూ, వారి ఆనందంలో మిగిలిన దేశవాసులు పాలుపంచుకోవడం ఇక్కడ ముఖ్య విషయమన్నారు. శనివారం వెల్లడైన ఎన్నికల ఫలితాల్లో, లెఫ్ట్‌పార్టీ కంచుకోటను బద్దలు కొట్టి భాజపా అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. అంతేకాదు నాగాలాండ్‌లో ప్రభుత్వ ఏర్పాటుకు భాజపాకు ఆహ్వానం అందగా, మేఘాలయలో హంగ్ అసెంబ్లీ ఏర్పడింది.