జాతీయ వార్తలు

మేఘాలయాలో ఎన్పీపీ సర్కారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

షిల్లాంగ్, మార్చి 4: మేఘాలయలో రాజకీయ సీన్ మారిపోయంది. అతిపెద్ద పార్టీగా కాంగ్రెస్ అవతరించినప్పటికీ మిత్రులను కూడగట్టడంలో విఫలం అయంది. అదే సమయంలో ఎన్‌పీపీ అధ్యక్షుడు కొన్రాడ్ సంగ్మా మేఘాలయ గవర్నర్‌ను కలిసి తనకు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఇవ్వాలని కోరారు. ఈ మేరకు ఆదివారం సాయంత్రం ఆయన గవర్నర్ గంగాప్రసాద్‌ను కలసి, తనకు 34 మంది ఎమ్మెల్యేల మద్దతున్నదని చెప్పారు. మేఘాలయ అసెంబ్లీలో మొత్తం 60 స్థానాలున్నాయి. మేఘాలయ అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాలేదు. కాంగ్రెస్ మాత్రం అతిపెద్ద పార్టీగా అవతరించింది. ప్రత్యర్థి పార్టీ నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్‌పిపి) కంటె స్వల్ప ఆధిక్యతను మాత్రమే సాధించింది. కాగా ఎన్‌పిపి, భాజపాకు మిత్రపక్షం. గవర్నర్‌ను కలిసిన అనంతరం సంగ్మా రాజ్‌భవన్ వెలుపల విలేకర్లతో మాట్లాడుతూ, 34 మంది సభ్యుల మద్దతుతో కూడిన లేఖను గవర్నర్‌కు అందజేశామన్నారు. వీరిలో 19 మంది ఎన్‌పిపి, ఆరుగురు యునైటెడ్ డెమోక్రటిక్ పార్టీ, నలుగురు పీపుల్స్ డెమోక్రటిక్ ఫ్రంట్, హిల్ స్టేట్ పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ, భాజపా, ఇండిపెండెంట్ సభ్యులు ఇద్దరేసి చొప్పున ఉన్నారని సంగ్మా తెలిపారు. ఎన్‌పిపి నేత కొన్రాడ్ సంగ్మా, దివంగత లోక్‌సభ మాజీ స్పీకర్ పీఏ సంగ్మా చిన్న కుమారుడు. పీఏ సంగ్మా 2016లో మరణించారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ 21 సీట్లు గెలుచుకున్నప్పటికీ, గత ఎన్నికల కంటే ఎనిమిది సీట్లు తక్కువ.

చిత్రం..ఆదివారం రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలిసి రాజీనామా సమర్పిస్తున్న మేఘాలయ ముఖ్యమంత్రి ముకుల్ సంగ్మా