జాతీయ వార్తలు

నేడు ఢిల్లీలో వైఎస్సార్ కాంగ్రెస్ ధర్నా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 4: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పించాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్‌సీపీ ఢిల్లీలోని పార్లమెంట్ స్ట్రీట్‌లో సోమవారం ‘మహాధర్నా’ నిర్వహించనుంది. పార్లమెంట్ రెండవ దఫా బడ్జెట్ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభంకానున్న నేపథ్యంలో వైఎస్సార్‌సీపీ ధర్నాకు పిలుపిచ్చింది. ఆ పార్టీకి చెందిన నాయకులు ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్నారు. ఈ ధర్నాకోసం విజయవాడ నుంచి బయలుదేరిన ప్రత్యేక రైలు ఆదివారం సాయంత్రం ఢిల్లీ చేరుకుంది. ఆ పార్టీ చేపట్టిన ధర్నాలో పాల్గొనేందుకు వచ్చిన ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి విలేఖరులతో మాట్లాడుతూ ఏపీకి న్యాయం జరగాలంటే ప్రత్యేక హోదా, ప్రత్యేక రాయితీలు ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు. బీజేపీ, టీడీపీ ఒకరిపై ఒకరు నిందలు వేసుకుంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏపీకి అన్ని విధాలుగా అన్యాయం చేస్తున్నాయని ఆరోపించారు. ‘ప్రత్యేక హోదా’ అని ఒకసారి ‘ప్రత్యేక ప్యాకేజీ’ అని మరోసారి అంటూ టీడీపీ నేతలు నాటకాలాడుతున్నారని కోటంరెడ్డి విమర్శించారు. ఎమ్మెల్యే కళావతి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గిరిజన హక్కులను హరించేలా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ఇతర కులాలను ఎస్టీ జాబితాలో కలుపుతూ రాష్ట్ర ప్రభుత్వం గిరిజనులకు అన్యాయం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. విభజన చట్టంలో పేర్కొన్న హామీలు అమలు జరగకపోతే షెడ్యూల్ కులాలవారికి న్యాయం జరగదని కళావతి అన్నారు. మరో ఎమ్మెల్యే రాజన్న దొర మాట్లాడుతూ ‘ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు.. అది భిక్ష కాదు’ అని పేర్కొన్నారు. మొదటినుంచీ ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తున్నది వైఎస్సార్‌సీపీయేనని రాజన్న దొర వెల్లడించారు.